సర్కారు వారి పాట' నుంచి మురారి బావ సాంగ్ రిలీజ్..

Satvika
మహేష్ బాబు ఇటీవల నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట.. ఈ సినిమా ఇటీవలే విడుదల అయ్యింది. బాక్సాఫిస్ వద్ద మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ సినిమా కూడా మహేష్ ఖాతా లో హిట్ టాక్ ను అందించింది. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించగా, పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్ అభిమానుల ను అమితంగా ఆకట్టుకుంది. కాగా ఈ సినిమాకు థమన్ సంగీతం మేజర్ అసెట్‌గా మారింది.


కాగా, ఈ సినిమాలో ముందుగా ఓ అదిరిపోయే మాస్ సాంగ్‌ను పెట్టాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ.. కొన్ని కారణాల వల్ల అది కాకుండా ఫైనల్‌గా 'మ.. మ.. మహేశా..' అనే పాటను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. అంతకు ముందు 'మురారి బావ' అనే సాంగ్‌ను రికార్డ్ చేశాడట థమన్. అయితే ఈ పాటను సినిమా విడుదల తరువాత ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. కానీ.. ఇప్పటివరకు ఈ పాట ఊసే లేకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.

 
అయితే తాజాగా ఈ పాటను రిలీజ్ చేసేందుకు మహేష్ బాబు డేట్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. మురారి బావ' సాంగ్‌ను సినిమా థియేటర్ల లో మే 31 నుంచి ప్రదర్శించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ పాటను సినిమా లో యాడ్ చేయాలని మహేష్ అండ్ టీమ్ భావిస్తున్నారట. మరి ఈ వార్త లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ మరో ప్రకటన ఇచ్చే వరకూ ఆగాల్సిందే.. ప్రస్తుతం మహేష్ వరుస సినిమాల తో బిజిగా ఉన్నాడు.. త్రివిక్రమ్, రాజమౌలి తో సినిమాలు చేయనున్నాడు  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: