టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో పూజా హెగ్డే ఒకరు ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు.ఇకపోతే ఈమె ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.ఇకపోతే పూజా మొదట్లో వరుస ప్లాప్స్ ఎదురవడంతో ఈమెకు అంతా డిమాండ్ లేకపోయింది.గతం లో ఈమె అల్లు అర్జున్ సరసన అల వైకుంఠపురములో సినిమా తర్వాత ఈమెకు స్టార్ డమ్ దక్కింది.అంతేకాదు ఈ సినిమా తర్వాత ఈమెను లక్కీ బ్యూటీ గా అభివర్ణిస్తున్నారు.అయితే అప్పటి నుండి వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకోవడమే కాకుండా అన్ని సినిమాలు హిట్ అవ్వడంతో ఈ అమ్మడి పేరు మారుమోగి పోయింది.
ఇక దీంతో టాలీవుడ్ తో పాటు మిగతా ఇండస్ట్రీ లలో కూడా క్రేజీ హీరోయిన్ గా మారి పోయింది. ఇకపోతే ఇటీవలే ఈమె నటించిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు రిలీజ్ అయ్యాయి.అంతేకాదు వీటి రిజల్ట్ ఎలా ఉన్న ఈమె నటన, గ్లామర్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే ప్రెసెంట్ ఈమె క్రేజీ సినిమాల్లో నటిస్తుంది.కాగా బాలీవుడ్ లో కభీ ఈద్ కభీ దివాలీ సినిమాలో సల్మాన్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు.ఇకపోతే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో రానున్న సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఇలా క్రేజీ స్టార్స్ సరసన నటిస్తూనే స్పెషల్ సాంగ్స్ లో కూడా చిందేస్తుంది.
తాజాగా ఎఫ్ 3 లో కూడా ఈమె స్పెషల్ సాంగ్ చేసింది.కాగా ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఇక ఈమె చేసిన సాంగ్ కు మంచి పేరు వచ్చింది. ఈ సాంగ్ తర్వాత ఈమెకు మరొక స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వచ్చిందట. అయితే సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యానిమల్. ఇందులో రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ ను సందీప్ ప్లాన్ చేసాడని అందులో బుట్టబొమ్మ ను తీసుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే మరి ఈ సాంగ్ కోసం పూజా ఒప్పుకుంటుందో లేదో చూడాలి.