ఈ టాలీవుడ్ యంగ్ హీరో అదృష్టవంతుడే ?

VAMSI
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని కుర్రాడు కిరణ్ అబ్బవరం. అయితే మొదటి సినిమాతోనే కుర్రాడిలో మంచి మ్యాటర్.. అలాగే మంచి భవిష్యత్తు ఉంది అనే అభిప్రాయంను చాలా మందికి కలిగించాడు. అయితే ఇతను చేసే సినిమాలు చిన్నవే అయినా కూడా మంచి కంటెంట్ తో ఉంటాయి అనే అభిప్రాయం ఏర్పడింది. అలాగే అతను నటించిన ఫస్ట్ రెండు సినిమాలు కూడా పర్వాలేదు అన్నట్లుగా నిలిచాయి. కాగా ఇటీవల విడుదలైన సెబాస్టియన్ సినిమా నిరాశ పర్చినా కూడా అందులో కిరణ్ పాత్రకు మంచిగానే కామెంట్స్ వచ్చాయి. అంతేకాదు కిరణ్ అబ్బవరంకు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయి.
కాగా ఇప్పటికే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పైన ఈ హీరో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. అంతేకాదు తాజాగా మరో సినిమాకి  కూడా కమిట్ అవ్వటంతో ఆ సినిమాకి సంబందించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కాగా ఈ సినిమాకి  "రూల్స్ రాజన్ " అనే టైటిల్ ను ఖరారు చేయగా, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాను సమర్పించబోతున్న నేపథ్యం అందరి లో ఆసక్తి నెలకొంది. అంతేకాదు  లైట్ ఎంటర్ టైన్మెంట్స్ మరియు సాయి సూర్య మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందించబడుతుందట.. అయితే ఈ సినిమా లో వెన్నెల కిషోర్.. హిమని.. వైశాలి ఇంకా జయవాణి ఇంకా పలువురు నటీ నటులు నటిస్తున్నారట.
రత్నం కృష్ణ ఈ సినిమాకు స్క్రిప్ట్ అందించగా, కిరణ్ అబ్బవరం మాత్రం విభిన్నమైన గెటప్ లో కనిపించబోతున్నారట. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు వంటి భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్న ఏఎం రత్నం నిర్మాణంలో సినిమా రావటంతో కిరణ్ అబ్బవరం లక్ భలే బాగుందే అంటూ నెటిజన్స్ అలాగే ఇండస్ట్రీ వర్గాలలో కూడా బాగా చర్చనీయాంశం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: