సాయి పల్లవి పెర్ఫామెన్స్‌కి, డాన్సులకి బోల్డంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. సౌత్ ఇండియా నుంచి మొదలుపెడితే నార్త్ ఇండియా వరకు జనాలంతా పల్లవి పెర్ఫామెన్స్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. అయితే 'శ్యామ్ సింగరాయ్' వచ్చాక కొంతమంది సాయి పల్లవి లుక్‌ని ట్రోల్ చేశారు. అందంగా కనిపించలేదని, పింపుల్స్‌తో సాదాసీదాగా ఉందని కామెంట్ చేశారు.
మంజిమా మోహన్ చాన్నాళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే తమిళనాట మాత్రం కెరీర్ కంటిన్యూ చేస్తోంది. కొన్నాళ్లుగా మంజిమా కొంచెం బొద్దుగా కనిపిస్తోంది. దీంతో మంజిమా ఇలా తయారైంది ఏంటని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఈ ట్రోలింగ్ ఎక్కువ కావడంతో, మంజిమా రియాక్ట్ అయింది. హెల్త్ ఇష్యూస్‌తో బరువు పెరుగుతుంటారు. అవేమి తెలియకుండా కామెంట్లు చేయొద్దని ఫైర్ అయింది మంజిమా.
అనుష్క 'సూపర్' సినిమాతో టాలీవుడ్‌లో భారీగా అభిమానులని సంపాదించుకుంది. ఆ తర్వాత 'బాహుబలి'తో నార్త్‌లోనూ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అయితే స్వీటీ శెట్టి 'సైజ్‌జీరో' కోసం బరువు పెరిగాక అభిమానం స్థానంలో ట్రోలింగ్ స్టార్ట్ అయింది. స్లిమ్ నుంచి సుమోలాగా ఇలా మారిపోయిందేంటని విమర్శించారు. ఈ బాడీ షేమింగ్‌తో కొన్నాళ్ల పాటు సినిమాలకి కూడా దూరమైంది స్వీటీ.
'గద్దలకొండ గణేష్' సినిమాలో చేసిన 'జర్రా జర్రా' సాంగ్‌తో డింపుల్ హయాతికి క్రేజీ ఫాలోయింగ్ వచ్చింది. ఈ స్పెషల్ సాంగ్ తర్వాత హయాతికి హీరోయిన్‌గా అవకాశాలు కూడా పెరిగాయి. రవితేజతో 'ఖిలాడి' సినిమా చేస్తోంది. అలాగే మరికొన్ని ప్రాజెక్టులు పైప్‌లైన్‌లో ఉన్నాయి. కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో డింపుల్ కలర్ తక్కువ అని ఎవరూ అవకాశాలు ఇవ్వలేదట. అయితే గద్దలకొండ గణేష్ తర్వాత డింపుల్ స్టార్ మారింది.
రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు నుంచి మొదలుపెట్టి హిందీ వరకు మల్టిపుల్ లాంగ్వేజస్‌లో సినిమాలు చేస్తోంది. మిస్ ఇండియా-2011 పోటీల్లో అయిదు టైటిల్స్ కూడా గెలుచుకుంది. కానీ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో రకుల్ కూడా బాడీ షేమింగ్ ఫేస్ చేసింది. కటౌట్ పర్లేదు గానీ, ముఖం చాలా సాధారణంగా ఉందని పక్కనపెట్టేశారట. అయితే ఆ తర్వాత 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో కెరీర్ స్పీడ్ ట్రాక్ ఎక్కింది. ఇప్పుడు బాలీవుడ్‌లో సెటిల్ అయిపోయింది.
నిత్యా మీనన్ పెర్ఫామెన్స్‌కి బోల్డన్ని అవార్డులు వచ్చాయి. జూ.సౌందర్య అనే ఇమేజ్ కూడా తెచ్చుకుంది. అయితే నిత్య నటనకి ఎన్ని ప్రశంసలు వచ్చాయో, బరువు పెరిగాక అన్ని ట్రోల్స్ వచ్చాయి. నిత్య బరువు పెరిగాక హీరోయిన్ మెటీరియల్ కాదని విమర్శించారు. దీనిపైనా నిత్య మీనన్ కూడా కొన్ని సందర్భాల్లో రియాక్ట్ అయింది. హెల్త్ ప్రాబ్లమ్స్‌తోనూ బరువు పెరుగుతారు. కానీ అవేమి తెలుసుకోకుండా విమర్శిస్తారని బాధపడింది నిత్య.