పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ కొంత కాలం పాటు వాయిదా పడింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. తిరిగి పున ప్రారంభం అయిన తరువాత హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే కొంత భాగం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఇంకా ఎక్కువ రోజులు డిలే చేసే ఉద్దేశం లేని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి , పవన్ కళ్యాణ్ ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తూ , పవన్ కళ్యాణ్ లేని సమయం లో పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తూ సినిమా షూటింగ్ ను శర వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్ని వేశంలో పవన్ కళ్యాణ్ తో పాటు మరో 1000 మంది ఉండబోతున్నట్లు సమాచారం.
ఈ భారీ యాక్షన్ సన్నివేశం ఈ మూవీ కే హైలైట్ గా నిలువనుందని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించబోతోంది. అలాగే హరిహర వీరమల్లు సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.