మాస్ బీట్ తో ఊపేనున్న మహేష్ కీర్తి సురేష్..!!

Divya
మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సర్కార్ వారి పాట చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధంగా. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా అలరించింది.. ఇక ఈ చిత్రం విడుదల తేది దగ్గర పడుతుండటంతో మేకర్స్ దూకుడుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. ఇదివరకే కళావతి, పేన్ని,SVP టైటిల్ సాంగ్స్ సోషల్ మీడియాలో అత్యధిక వ్యూస్ ను రాబట్టాయి.
ఇక ఈ చిత్రంలోని పాటలు కూడా చాలా ట్రెండి గానే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మహేష్ ఫ్యాన్స్ ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి సర్కారు వారి పాట చిత్రబృందం సరికొత్త అప్ డేట్ ని తీసుకు వచ్చింది. ఈ సినిమాలోని.. మా మా మహేషా అనే మాసాన్ని శనివారం రోజున విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమాలోని ఈ పాట  మోస్ట్ సాంగ్ అని తెలియజేశారు. ఈ సందర్భంగా విడుదల తేది అనౌన్స్మెంట్ పోస్టర్లు కూడా సూచించడం జరిగింది. ఇక ఇందులో విడుదల చేసిన పోస్టర్ విషయానికి వస్తే మహేష్ కీర్తి సురేష్ కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్లో సరి కొత్తగా కనిపిస్తున్నారు.

ఇద్దరు మాస్ స్టెప్పులతో అదరగొట్టే విధంగా కనిపించడం జరుగుతుంది. ఇక సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మైండ్ బ్లాక్ ఆ పాటకు మించి ఈ పాట ఉండబోతోంది అన్నట్లుగా సమాచారం. ఈ పాట కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ ట్యూన్ కంపోజ్ చేయగా అనంతశ్రీరామ్ సాహిత్యం అందించారు. శేఖర్ మాస్టర్ ఈ సాంగుకు డాన్స్ కొరియోగ్రాఫర్ చేశారు. ఈ సినిమాలో మాస్ స్టెప్పులు ఓ రేంజిలో ఉంటాయి అని అభిమానులు భావిస్తున్నారు ఈ చిత్రం మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కు సిద్ధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: