వామ్మో : ఇది నిజమా .... ఎన్టీఆర్ సినిమా నుండి ఆమె అవుట్ .... ??

GVK Writings
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో కొరటాల శివ తో తన నెక్స్ట్ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవల వరుసగా విజయాల బాటలో కొనసాగుతున్న ఎన్టీఆర్ కి మొన్న రిలీజ్ అయిన భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ రూపంలో మరొక భారీ సక్సెస్ లభించింది. దానితో కొరటాల శివ సినిమా కోసం ప్రస్తుతం సన్నద్ధం అవుతున్న ఎన్టీఆర్, దానితో కూడా మరొక విజయం అందుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టాక్.
ఇక ఈ సినిమా భారీ యాక్షన్ తో పాటు ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని, అలానే తన గత సినిమాల మాదిరిగా మెసేజ్ సినిమాగా కాకుండా ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని మరింతగా అలరించేలా ఈ స్క్రిప్ట్ ని ఎంతో అద్భుతంగా సిద్ధం చేసినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనుండగా ఆర్ఆర్ఆర్ భామ అలియా భట్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా నటిస్తున్నట్లు ఇటీవల కొన్నాళ్లుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి.
అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అలియా భట్ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు చెప్తున్నారు. ఇటీవల రణబీర్ కపూర్ ని వివాహం చేసుకున్న అలియా త్వరలో హనీమూన్ వెళ్లనున్నారని, అలానే తదుపరి ఆమెకు మరికొన్ని కమిట్మెంట్స్ ఉన్న కారణంగా ఆమె ఈ సినిమాలో నటించడం లేదని, ఇప్పటికే మరొక యువ స్టార్ కథానాయికని ఈ సినిమా కోసం ఇప్పటికే యూనిట్ ఎంపిక చేసిందని, త్వరలో దాని పై అధికారికంగా అనౌన్స్ మెంట్ కూడా రానుందని సమాచారం. మరి దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే కొన్నాళ్లవరకు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. కాగా ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: