చరణ్ కి ఆ ఇమేజ్ ఇంకా రాలేదా..!!

P.Nishanth Kumar
పాన్ ఇండియా హీరో గా ఎదగాలని అందరూ హీరోలు కూడా దానికి తగ్గట్లుగానే సినిమాలు చేస్తున్నారు. వారిలో ఒకరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పుడంటే అందరు హీరోలు ఈ విధమైన సినిమాలు చేస్తున్నారు కానీ ఎవరు ఈ తరహా సినిమాలు చేయడం మొదలు పెట్టని దశలోనే ఆయన పాన్ ఇండియా హీరోగా ఎదగాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. బాలీవుడ్ లో ఆయన జంజీర్ సినిమాను రీమేక్ చేసి అక్కడ విడుదల చేసాడు. అది ఫ్లాప్ అవడంతో మళ్లీ బాలీవుడ్ లో సినిమా చేసే ఆలోచన అనేసాడు లేదంటే ఈ పాటికే చరణ్ అక్కడ కూడా స్టార్ హీరో గా ఉండేవాడు.

మళ్లీ ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఆయన పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్లను అందుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ చిత్రానికి ఇంతటి స్థాయిలో కలెక్షన్లు రావడానికి కారణం రాజమౌళి ఒకరైతే ఎన్టీఆర్ కూడా మరొకరు. వీరు ముగ్గురు కలిసి ఈ సినిమా ఇంతటి స్థాయిలో ప్రేక్షకులను అలరించడానికి కారణం అయ్యింది. అయితే ఈ సినిమా తరువాత చరణ్ నటించిన సినిమా ఆచార్య సినిమా డిజాస్టర్ కావడం మెగా అభిమానులు ఎంతగానో నిరాశపరిచింది.

ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించిన చరణ్ ఇమేజ్ ఎందుకు ఈ సినిమాకి ఉపయోగపడలేదో అర్థం కావడం లేదు. ఈ సినిమా విడుదల అయ్యి ఇల్లు కూడా దాటని నేపథ్యంలో విడుదలైన ఆచార్య సినిమా చరణ్ ను చూసిన మంచి కలెక్షన్లను సాధించాలి మరి ఎక్కడ ఈ క్యాలిక్యులేషన్ మిస్ అయిందో అర్థం కావడం లేదు. పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ అలాగే ఇమేజ్ రావడం అంటే అంత మామూలు విషయం కాదు ప్రేక్షకులను తన నటనతో డాన్సులతో ఫైట్లతో మెప్పించి వారిని అభిమానులుగా మార్చుకోవాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో ఆచార్య డిజాస్టర్ అవ్వడం పాన్ ఇండియా ఇమేజ్ అనే అర్థాన్ని సూచిస్తుందని అనుకోవాలా అనేది అర్థం కావట్లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: