మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. అంతేకాదు 132.50 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ దగ్గర ఆచార్య సినిమా బరిలో దిగింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 29.50 కోట్లు రాబట్టింది. రెండో రోజు రూ. 5.15 కోట్ల వసూళ్లను రాబడితే.. మూడో రోజు ఆదివారం నాడు రూ. 4.07 కోట్లు మాత్రమే రాబట్టి చాలా దారుణంగా బాక్సాఫీస్‌ను నిరాశ పరిచింది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో వసూలు చెయ్యలేక చేతులేత్తేసింది. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో ఈ సినిమా రూ. 4.07 కోట్లు మాత్రమే రాబట్టింది. ఓవర్సీస్ ఇంకా అలాగే మిగతా ఏరియాల్లో కలిపితే.. మొత్తం రూ. 38 లక్షలు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమా రూ. 4.45 కోట్లు వసూళ్లను రాబట్టింది.ఇక 3 రోజుల్లో ఈ సినిమా రూ. 45.52 కోట్ల షేర్ (రూ. 70.65 కోట్ల షేర్) రాబట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 86.98 కోట్లను రాబడితే కానీ సేఫ్ అయ్యి బ్రేక్ ఈవెన్ పూర్తి కాదు. ఇపుడున్న పరిస్థితుల్లో అయితే ఆచార్య సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి కావడం దాదాపు అసాధ్యమే అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా రియల్ హీరో సోనూ సూద్ నటించారు.
ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ కంపెనీ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ డీల్‌కు సంబంధించిన అన్ని అగ్నిమెంట్స్ కూడా పూర్తైయినట్టు సమాచారం తెలుస్తుంది. ఇక 'ఆచార్య' సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో బాగా ఆడిపాడింది.ఇక ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే పేరును ఫైనల్ చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11 వ తేదీన విడుదలకానుందని సమాచారం. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా కీలకపాత్రలో కనిపించనున్నారు.