రవితేజ అభిమానులకు శుభవార్త.. సినీ ఎంట్రీ ఇవ్వనున్న మాస్ మహారాజా తనయుడు..!!

Divya
టాలీవుడ్ లోకి స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇచ్చే ఆచారం ఎన్టీఆర్ కాలం నుంచి వస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా మరొక స్టార్ హీరో వారసుడు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. బడా హీరోల నుంచి స్టార్ హీరోల కుటుంబాల వరకు ఎంతోమంది వారసులు తెరమీదకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ కుమారుడు కూడా వెండితెరపైకి హీరోగా రావడానికి దూసుకు వచ్చేస్తాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన రవితేజ కు మొత్తం సౌత్ ఇండియా అంతటా మంచి గుర్తింపు ఉంది.
ఈయనకు మహాధన్ అనే ఒక కొడుకు ఉన్నాడు. ఇక  అబ్బాయి పెరిగి పెద్దవాడైన విషయం చాలామందికి తెలియదు అని చెప్పాలి . ఎందుకంటే.. గతంలో రవితేజ వారసుడు ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని అందరూ అనుకుంటూ ఉండగా. రవితేజ మేకప్ మాన్.. రవితేజ కొడుకు కి ఇప్పుడే ఇండస్ట్రీ లోకి రావాలని ఆసక్తి లేదు చదువులో ఎప్పుడూ ముందుంటాడు చాలా ఇంటెలిజెంట్ అంటూ మహాధన్ గురించి చెప్పిన విషయం తెలిసిందే. కానీ అది సంవత్సరాలు కూడా అయిపోయింది. ఇప్పుడు పెరిగి పెద్దవాడయ్యాడు అందుకే హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు.
హరీష్ దర్శకత్వంలో ఒక యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో తన మొదటి సినిమాకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా మహాధన్ కూడా ఇప్పటికీ రవితేజ నటించిన రాజా ది గ్రేట్ సినిమా లో రవితేజ చిన్నప్పటి పాత్రలో నటించి అందరిని మెప్పించాడు. ఇదిలా ఉండగా హరీష్ శంకర్ ఒక అద్భుతమైన కథను తయారు చేశాడట. రవితేజతో కథ చర్చలు కూడా జరిపినట్లు తర్వాత మహా ధన్ లాంచింగ్ ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే మొదటి సినిమాతో మహాధన్ మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా అందరూ కోరుకోవడం తో పాటు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: