రమ్యకృష్ణ స్థాయిలో సుమ మెప్పించ గలదా ?
ఇక టీవిలకు సంబంధించి ఆమె హోస్ట్ చేసే గేమ్ షోలకు ఇతర కార్యక్రమాలకు ఆమె ఒక ఎపిసోడ్ కు లక్షల పారితోషికం తీసుకుంటుంది అని అంటారు. బుల్లితెర సెలెబ్రెటీలలో సుమకు ఉన్నంత ఆస్థులు మరెవ్వరికీ లేవు అన్నప్రచారం కూడ ఉంది. వాస్తవానికి సుమ కెరియర్ మొదట్లో సినిమాలతో ప్రారంభం అయింది. అయితే అప్పట్లో ఆమె నటించిన సినిమాలు పెద్దగా సక్సస్ కాకపోవడంతో ఆమె తన రూట్ మార్చుకుని ఆరోజులలో అప్పుడప్పుడే ప్రారంభం అవుతున్న ఛానల్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
అయితే సుమకు నటిగా రాణించాలి అన్నకోరిక చాల ఎక్కువగా ఉండటంతో ఇప్పుడు ‘జయమ్మ పంచాయితీ’ మూవీతో మళ్ళీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. అనారోగ్యంతో బాధపడే ఒక అసమర్థుడైన భర్తను అతడి కుటుంబాన్ని ఎన్నోసమస్యలు ఎదిరించి ఎలా విజయం సాధించింది అన్న ఒక సింపుల్ కథలో సుమ నటించింది. కొత్త దర్శకుడు విజయ్ కుమార్ తీసిన ఈమూవీ మే మొదటి వారంలో విడుదలకాబోతోంది.
ఈసినిమా ప్రమోషన్ ను చాల ముందుగానే ప్రారంభించారు. ఈమూవీ ప్రమోషన్ కార్యక్రమంలో దర్శకుడు విజయ్ కుమార్ కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. వాస్తవానికి ఈమూవీ కథను దర్శకుడు రమ్యకృష్ణ ను దృష్టిలో పెట్టుకుని వ్రాసాదట. అయితే అతడు రమ్యకృష్ణ ను కలిసేలోపు విజయ్ కుమార్ సుమను కలిసి సుమను కలిసి జయమ్మ లాంటి పవర్ ఫుల్ పాత్ర చేయగలరా అని అడిగాడట. దానితో సుమకు పంతం పెరిగి తాను చేసి చూపెడతాను అని అనడంతో ఈప్రాజెక్ట్ రమ్యకృష్ణను దాటుకుని సుమ దగ్గరకు చేరిందని విజయ్ కుమార్ చెపుతున్నాడు. మరి రమ్యకృష్ణ స్థాయిలో సుమ చేయగలదా అన్నది వేచి చూడాలి..