ఆచార్య ఫైనల్ కాపీలో భారీ మార్పులు !
‘ఆచార్య’ విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈమూవీ సెన్సార్ కార్యక్రమాలు కూడ పూర్తి కావడంతో ఈమూవీని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధియేటర్లలో విడుదల చేసి ఫస్ట్ డే కలక్షన్స్ రికార్డుల పై ఈమూవీ నిర్మాతలు భారీ వ్యూహాలు అనుసరిస్తున్నారు. ఈ పరిస్థితులలో ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ గా ప్రచారంలోకి వచ్చిన ఒక షాకింగ్ గాసిప్ పై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.
హల్ చల్ చేస్తున్న ఈ వార్తల ప్రకారం ‘ఆచార్య’ మూవీలో కాజల్ పాత్రను పూర్తిగా తీసేశారు అని అంటున్నారు. దీనికి కారణం ఈమూవీలో చిరంజీవి పాత్ర ఒక సామాజిక స్పృహ కలిగిన పాత్ర కాబట్టి ఆపాత్రకు లవ్ ట్రాక్ క్రియేట్ చేసి చూపెడితే దానిపై విమర్శలు వచ్చే ఆస్కారం ఉందని కొరటాల భావించడంతో చిరంజీవి అంగీకారంతో కాజల్ పాత్రను ఈ మూవీ నుండి పూర్తిగా తొలగించారు అన్న వార్తలు ఉన్నాయి.
ఈవిషయాన్ని వ్యక్తిగతంగా కాజల్ కు కూడ కొన్నిరోజుల క్రితం చెప్పడం జరిగిందని అందువల్లనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కాజల్ ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజున కనీసం తన అభినందనలు తెలియచేయలేదు అంటున్నారు. ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కొరటాల అదేవిధంగా చిరంజీవిలు ఈ మూవీలో పనిచేసిన అందరి గురించి చెప్పారు కానీ కాజల్ గురించి చెప్పకపోవడంతో ఆమె పాత్రను ఈమూవీ నుండి తీసివేసినట్లే అన్నప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి ఈమూవీకి సంబంధించిన ‘లాహే లాహే’ పాటలో కాజల్ స్టెప్స్ వేసిన సన్నివేశాలు ఉన్నాయి. ఈసన్నివేసాలు కూడ ఈపాటలో తోలిగించినట్లే అంటున్నారు. అయితే చిరంజీవి ఈమూవీలో రెజీనా తో చేసిన ఐటమ్ సాంగ్ ను మాత్రం మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఉంచారు అంటున్నారు. ఈమూవీ నిడివి మూడు గంటలు దాటి పోవడంతో ఈ మూవీ నిడివిని ఎలా తగ్గించాలో తెలియక టోటల్ గా కాజల్ చిరంజీవిల లవ్ ట్రాక్ ను తీసేసినట్లు టాక్..