అదరగొడుతున్న సర్కారు వారి పాట టైటిల్ సాంగ్..!!

Divya
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు సినిమా విడుదల కాక ఇప్పటికి రెండు సంవత్సరాలు కావస్తోంది. అయితే మహేష్ నటిస్తున్న తాజా చిత్రం సర్కార్ వారి పాట ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇక చివరిగా సరిలేరు నీకెవ్వరు అనే చిత్రం తో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్. ఇక ఆ తరువాత అంతటి భారీ అంచనాలు ఈ చిత్రంపైనే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది

ఇందులో మహేష్ సరసన అందాల హీరోయిన్ కీర్తిసురేష్ నటిస్తున్నది ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు పాటలు ఈ చిత్రాన్ని మరింత అంచనాలను పెంచిన చేశాయి. మొదటిగా విడుదలైన టీజర్ ఎంతో అద్భుతమైన స్పందన లభించింది. ఇక ఈ చిత్రానికి సంగీతం తమన్ సారథ్యంలో జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి 2 సాంగ్స్ విడుదల కాగా ఈ రెండు పాటలు సోషల్ మీడియా షేక్ చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఇదే మూవీ నుంచి ఒక టైటిల్ సాంగ్ ను కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

తమన్ మరొకసారి తన స్టామినా ఏంటో ఈ పాటతో ఫ్రూట్ చేశారని చెప్పవచ్చు. ఈ పాట విన్న ట్లయితే సినిమాకు తమన్ సంగీత చాలా హైలెట్గా నిలిచే లా కనిపిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్  ఈ చిత్రం లో కావాల్సినంత ఉండేలా కనిపిస్తోంది. అంతేకాకుండా మహేష్ బాబు చేసే కామెడీ కూడా ఈ చిత్రానికి హైలెట్గా నిలిచే ఎలా ఉండాలి ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక మహేష్ ఈ సినిమాలో భాగస్వాములు కావడం గమనార్హం. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: