ముఖేష్ అంబానీ కోడలు ఆస్తి విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Divya
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కొడుకు ఆకాశ్ అంబానీ సతీమణి శ్లోకా మెహతాకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోంది. అంతేకాదు ఆమె ఆస్తుల వివరాలు కూడా బయటకు రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే చిన్నప్పటినుంచి ఎంతో స్నేహంగా పెరిగిన ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా లు గత కొద్ది రోజుల క్రితం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ శ్లోక మెహతా ఎవరో కాదు రోజీ బ్లూ అనే డైమండ్ కంపెనీ యొక్క అధినేత అయిన రస్సెల్ మెహతా కుమార్తె నే ఈమె కావడం గమనార్హం.

ఇక ఇంత సంపన్నుల కుటుంబం నుంచి వచ్చిన ఈమె ఆస్తి వివరాలు కూడా ప్రస్తుతం బాగా వైరల్ గా మారుతున్నాయి. ప్రపంచంలో ఉన్న లగ్జరీ కార్లు అన్నీ కూడా శ్లోక మెహతా దగ్గర ఉన్నట్లు సమాచారం. ఇటీవల తాజాగా ఈమె నాలుగు కోట్ల రూపాయల విలువైన బెంగ్లీ లగ్జరీ కార్ ను కూడా కొనుగోలు చేసింది. గత కొద్ది రోజుల క్రితం శ్లోక మెహతా ఆస్తి కూడా 25 శాతం పెరిగినట్లు సమాచారం. శ్లోక మెహతా తండ్రి రస్సెల్ మెహతా రోజీ బ్లూ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే ప్రస్తుతం ఈ డైమండ్ సంస్థ భారత దేశంలో వేగంగా విస్తరిస్తోంది.
ఇక ఎప్పుడూ చదువులో ముందుండే శ్లోక మెహతా .. ఆకాశ్ అంబానీ ని వివాహం చేసుకోక ముందు వరకు తన తెలివితేటలతో డైమండ్స్ కంపెనీని ముందుండి మరి నడిపించింది అట. ఇక తన తండ్రి ఆస్తి కాకుండా కేవలం శ్లోక మెహతా నికర సంపద రూ.120 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఇక అంతే కాదు గత కొద్ది రోజుల క్రితమే ఆ సంపద కూడా సుమారుగా 25 శాతం పెరిగినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: