నాచురల్ స్టార్ నాని గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాచురల్ స్టార్ నాని అష్టా చమ్మా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తరువాత నాని నటించిన అనేక సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం విడుదలైన శ్యామ్ సింగరాయ్ సినిమాతో నాచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. శ్యామ్ సింగరాయ్ సినిమా కంటే ముందు నాని నటించిన వి మరియు టక్ జగదీష్ మూవీ లో థియేటర్ లలో కాకుండా నేరుగా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో విడుదలయ్యాయి. శ్యామ్ సింగరాయ్ సినిమా మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇది ఇలా ఉంటే నాని ప్రస్తుతం అంటే సుందరానికి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో నాని సరసన నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంటే సుందరానికి మూవీని జూన్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉంటే సుందరానికి చిత్ర బృందం ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేసింది. హైదరాబాద్ లోని ఏఎంజీలో జరిగిన అంటే సుందరానికి మూవీ టీజర్ లాంచ్ కార్యక్రమంలో నాని, నజ్రీయాతో పాటు చిత్ర యూనిట్ అంతా పాల్గొంది. ఈ మూవీ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నాని మాట్లాడుతూ... అంటే సుందరానికి మూవీ నాకు ఎంతో ప్రత్యేకం. ప్రతి ఒక్కరికి అంటే సుందరానికి సినిమా నచ్చుతుంది. వివేక్ ఆత్రేయ ఏ మూవీ చేసినా.. కథను అతడు తప్ప వేరే ఎవరూ అంత బాగా చెప్పలేరు అని నాని అన్నాడు. టీజర్ లో చూపించిన దాని కంటే రెండు రెట్లు ట్రైలర్, పది రెట్లు మూవీ ఉంటుంది అని నాని అన్నారు.