రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేవి శ్రీ ప్రసాద్ ఎన్నో విజయవంతమైన సినిమాలకు అదిరిపోయే సంగీతాన్ని సమకూర్చి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ మ్యూజిక్ దర్శకుల్లో ఒకరిగా ఓ వెలుగు వెలుగుతున్నడు. ప్రస్తుతం కూడా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అనేక సినిమాలకు సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇది ఇలా ఉంటే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కేవలం టాలీవుడ్ సినిమాలకు మాత్రమే కాకుండా ఇతర భాషా సినిమాలకు కూడా సంగీతాన్ని సమకూర్చి అక్కడ కూడా ఎంతో మంది ప్రేక్షకులను అలరించాడు.
ఇది ఇలా ఉంటే దేవి శ్రీ ప్రసాద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాలకు సంగీతాన్ని సమకూర్చాడు. ఇది ఇలా ఉంటే దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమాకు సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రామ్ పోతినేని హీరోగా తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది వారియర్ సినిమాకు కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇది ఇలా ఉంటే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఎఫ్ 3 సినిమాలోని రెండవ లిరికల్ సాంగ్ అయినా 'వూ ఆ ఆహా ఆహా' సాంగ్ ఏప్రిల్ 22 వ తేదిన విడుదల కాబోతుంది. ఈ సినిమాతో పాటు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ది వారియర్ సినిమాలోని మొదటి లిరికల్ సాంగ్ బుల్లెట్ సాంగ్ కూడా ఏప్రిల్ 22 వ తేదీన సాయంత్రం 5.45 నిమిషాలకు విడుదల కాబోతుంది. ఇలా ఒకే రోజు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన రెండు పాటలు విడుదల కాబోతున్నాయి. ఇలా ఒకే రోజు దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతంతో ప్రేక్షకులకు డబల్ ధమాకా ఇవ్వనున్నాడు.