చీరకట్టులో మైమరపిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా..!

Pulgam Srinivas
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమన్నా ఎన్నో విజయవంతమైన సినిమా లతో పాన్ ఇండియా రేంజ్ లో  హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి తమన్నా 'హ్యాపీ డేస్'  సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకుంది.  ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లోని చాలా మంది స్టార్ హీరోల సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతో కాలం పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తమన్నా సీనియర్ స్టార్ హీరోల సరసన నటిస్తూ తన హవా ను కొనసాగిస్తోంది.  ప్రస్తుతం తమన్నా , వెంకటేష్ సరసన  ఎఫ్ 3 సినిమాలో కథానాయికగా నటిస్తోంది.  ఎఫ్ 3 సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.


అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.  ఇది ఇలా ఉంటే తమన్నా సినిమాల్లో తన అందచందాలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకొని ప్రస్తుతం కూడా సినిమా ఇండస్ట్రీ లో తన జోష్ ను కంటిన్యూ చేస్తోంది.  ఇది ఇలా ఉంటే తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నయి.  అసలు విషయంలోకి వెళితే... తాజాగా బాబా సిద్దిఖీ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. తమన్నా కు కూడా ఆహ్వానం అందడంతో ఈ డిన్నర్ కు తమన్నా కూడా హాజరయ్యింది. ఈ డిన్నర్ లో భాగంగా చీర కట్టుకొని , స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకొని , అందంగా స్మైల్ ఇస్తూ ఉన్న  తమన్నా ఫోటోలు ప్రస్తుతం నెటింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: