ప్రముఖ టాలీవుడ్ నటుడు అయిన కాదంబరి కిరణ్ గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు.కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 270 కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించాడు.
బుల్లితెర పై కూడా పలు షోలు చేసి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాడు. 'మనం సైతం' అనే సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాడు నటుడు కాదంబరి.మా('మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్') సభ్యుడిగా కూడా కొనసాగుతూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఈయన ఎక్కువ సినిమాల్లో అయితే కనిపించడం లేదు.
'రాజ రాజ చోర' 'థాంక్యూ బ్రదర్' 'నారప్ప' 'భీమ్లా నాయక్' వంటి సినిమాల్లో ఈయన బాగా నటించారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈయన మెగా పవర్ స్టార్ రాంచరణ్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయని తెలుస్తోంది.. ఈయన చేసిన కామెంట్స్ ను నటుడు బ్రహ్మాజీ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఈ పోస్ట్ వైరల్ గా మారిందట.కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.. 'రాంచరణ్! అందరికీ తెల్సి..ఒక పెద్ద స్టార్,మెగాస్టార్(మా అన్న) కొడుకు.కానీ నాకు తెలిసి ఒక మనసున్న మనిషి! భక్తి ,ప్రేమ,గౌరవం..ఇలాంటి విలువలు తెల్సిన మనిషి.
సాటి మనిషిని మనిషిగా చూసే వ్యక్తిత్వం అతనిది. గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే,ఆమె డెడ్ బాడీ తీసుకోవడానికి ఆసుపత్రి కి చెల్లించడానికి డబ్బుల్లేకపోతే సుకుమార్ అన్న చొరవతో *రాంచరణ్* ని అడుక్కొని 2లక్షలు తీసుకుని *మనం సైతం* ద్వారా ఆ కార్యక్రమం పూర్తిచేసానని .అవికాక *సుక్కన్న,*మనం సైతం* ,విజయ్ అన్న,రాము తదితరుల వద్ద 1,20,000/- పోగుచేసి చనిపోయినామె పాప(18 నెలల) పేరున FD చేయమని ఇవ్వడం జరిగిందని చెప్పాడు.
ఇప్పుడు..ఇన్నిరోజుల తర్వాత నేనుఎదురు పడితే *రాంచరణ్* 'ఆపాప ఎలావుంది కాదంబరి గారూ?'అని అడిగాడు. అతని వ్యక్తిత్వానికి నాకు గుండె నిండిపోయింది. బంగరు చెంచాతో పుట్టడం వేరు, బంగరు మనసుతో బతకడం వేరు. ప్రియ చరణ్! నీకు భగవదాశీస్సులు' అంటూ చెప్పుకొచ్చాడట.. అయితే ఈ పోస్ట్ లో చరణ్ ను పొగుడుతూ రాసారట కాదంబరి.. అక్కడి వరకు బాగానే ఉంది కానీ 'అడుక్కోవడం' అనే పదాన్ని వాడడం కొందరిని బాగా నొప్పించింది.