యాంకర్ అనసూయ.. ఎంత పద్దతిగా ఉందో?

praveen
జబర్దస్త్ యాంకర్ అనసూయ కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటి వరకు ఎవరికీ తెలియని అనసూయ జబర్దస్త్ అనే కార్యక్రమంలో యాంకర్ గా ప్రత్యక్షమైంది. తన వాక్చాతుర్యంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. జబర్దస్త్ కార్యక్రమం ఊహించని రీతిలో నవ్వులు పంచి తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో యాంకర్ అనసూయ కాస్త స్టార్ యాంకర్ గా మారిపోయింది. ఇక ఎన్నో ఏళ్ల నుంచి జబర్దస్త్ కార్యక్రమం లోనే కొనసాగుతూ వస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే జబర్దస్త్ తోనే కేవలం తన కెరీర్ని ఆపకుండా వెండితెరపై కూడా కన్నేసింది.


 ఇక వెండితెరపై వచ్చిన ప్రతి అవకాశాన్ని కాదనకుండా చేస్తూ అటు నటిగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఇప్పుడు అనసూయ ఏదైనా పాత్ర చేస్తుంది అంటే చాలు ఆ పాత్ర నటనకు ప్రాధాన్యం ఉన్నది అని తెలుగు ప్రేక్షకులు నమ్ముతూ ఉన్నారు. అంతలా తన నటనతో తన పాత్రల సెలక్షన్ తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా మారి ప్రతి తెలుగు ఇంటికి దగ్గరైనా అనసూయ పుష్ప సినిమాలో దాక్షాయిని గా తన విలనిజంతో అందరినీ భయపెట్టింది. అయితే సినిమాల్లో ఎన్ని ఆఫర్లు వచ్చినా తనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టిన జబర్దస్త్ ను వదలడంలేదు అనసూయ.


 ఇకపోతే అప్పుడప్పుడు మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపిస్తూ ఇక సోషల్ మీడియాలో కొంతమంది ఆగ్రహానికి గురవుతూ ఉంటుంది. కానీ ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా తెలుగుతనం ఉట్టిపడే దుస్తుల్లో కనిపించింది. ఇక అనసూయను చూసి అచ్చమైన   తెలుగమ్మాయి లా ఉన్నారు మేడం అంటూ అభిమానులు అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. సాంప్రదాయమైన చీరకట్టులో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది అనసూయ. సాంప్రదాయానికి చీర కట్టినట్లుగా ఉన్నారు మీరు ఎప్పటికీ ఇలాగే పదహారణాల తెలుగు ఆడపడుచులా ఉండాలని కోరుకుంటున్నాము అంటు అభిమానులు కామెంట్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: