KGF 2 : టికెట్ రేట్ల పెరుగుదలకు అనుమతి వస్తుందా?

Purushottham Vinay
నాలుగు సంవత్సరాల క్రితం విడుదల అయిన 'కేజీయఫ్ 1' సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విజయం సాధించింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రూపొందిన 'కేజీఎఫ్ 2' కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14 వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. 'కేజీఎఫ్: చాప్టర్ 2' ని తెలుగు రాష్ట్రాల్లో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్రాల్లో టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 110 కోట్లకు పైగా ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.'కేజీఎఫ్ చాప్టర్ 1' ఫుల్ రన్ లో తెలుగు రాష్ట్రాలలో రూ. 12.30 కోట్ల షేర్ వసూలు. అంటే ఇప్పుడు 'చాప్టర్ 2' రేట్లు కూడా దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. సినిమా మీదున్న హైప్ వల్ల టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో నైజాంలో 50 కోట్లు ఇంకా అలాగే సీడెడ్ లో 20 కోట్లకు ఈ సినిమాని తీసుకున్నట్లు టాక్.అయితే అంత మొత్తంలో డబ్బు పెడుతున్నప్పుడు అవి తిరిగి పొందాలంటే ప్రభుత్వాల నుంచి సపోర్ట్ కచ్చితంగా అవసరం ఉంటుంది.




నిర్మాతలు కోరితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణాలో భారీ బడ్జెట్ సినిమాలను ప్రత్యేకంగా పరిగణించి కొన్ని రోజులు సాధారణ టికెట్ ధరల కంటే ఎక్కువగా అమ్మడానికి అనుమతి ఇస్తూ ఉంటాయి.ఇప్పుడు 'కేజీఎఫ్ 2' సినిమా టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం తెలుస్తోంది.ఇక రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక పెంపుదల అనుమతులు ఒకటి రెండు రోజుల్లో అందే ఛాన్స్ ఉందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్లు పెంచుకోడానికి కొన్ని షరతులు అనేవి ఉన్నాయి.మరి ఆంధ్రప్రదేశ్ లో 'కేజీఎఫ్ 2' చిత్రానికి ఎంత మేర స్పెషల్ హైక్స్ ఉంటాయో అనేది ఇక చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపు అనుమతులు వచ్చిన వెంటనే సోమవారం నాడు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే ఇతర భాషల్లో బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: