సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన అలనాటి హీరోయిన్..!!

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దివంగత డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను బాగానే అలరించాయి. అలాంటి చిత్రాల్లో చాలా బాగుంది చిత్రం కూడా ఒకటి. ఇందులో హీరోయిన్ మాళవిక, శ్రీకాంత్, వడ్డే నవీన్ నటించారు. ఇక ఈ సినిమాలో ఆమె అభినయానికి మంచి మార్కులు పడ్డాయి అని చెప్పవచ్చు. ఇక అటు తర్వాత ఒకవైపు కన్నడ, మలయాళం, తమిళం వంటి భాషలలో మంచి కథానాయకుడిగా పేరుపొందింది మాళవిక. అలా సినిమాలలో బిజీ ఉండగానే.. 2007వ సంవత్సరంలో సురేష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ వివాహం అయిన వెంటనే సినిమాలకు దూరంగా ఉన్నది. కానీ ఈమె చివరిసారిగా నటించిన చిత్రం చంద్రముఖి. అయితే ఆ తర్వాత ఈమె ఇక ఏ సినిమాలో కూడా నటించలేదు. అయితే గత కొద్ది రోజుల క్రితం బుల్లితెరపై ఒక టీవీ షోలో పాల్గొని ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నట్లు తెలియజేసింది. దీంతో  1999 లో ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో అజిత్ కథానాయకుడిగా తెరకెక్కించిన చిత్రం ‘ఉన్నై తేడి’ అనే సినిమాతో మొదటిసారిగా వెండితెరకు పరిచయమైన ది మాళవిక.

ప్రస్తుతం ఇప్పుడు ఆయన డైరెక్షన్ లోనే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని గోల్ మాల్ అనే పేరుతో తెరకెక్కించబోతున్నారు ఈ చిత్రాన్ని. ఇందులో ఈమె పేరు మంగమ్మ అనే పాత్ర ను నటించబోతున్నట్లు సమాచారం. ఇక ఇందులో హీరోలుగా జై, జీవ నటిస్తున్నారు. ఇక కథానాయకులుగా అమృత అయ్యర్, రైజా విల్సన్, ఐశ్వర్య దత్త తదితరులు ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇటీవల సినిమా షూటింగ్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ లో మాళవిక పాల్గొన్న కొన్ని ఫోటోలు మాత్రమే  చాలా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: