'ప్రభాస్ - మారుతి' సినిమాకు ముహూర్తం ఖరారు.. వచ్చే గెస్ట్ లు వీళ్ళే..!

Anilkumar
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. అది ప్రభాస్ - మారుతి సినిమా గురించి. వీరి కాంబినేషన్లో సినిమా అనుకున్నారని.. టైటిల్ కూడా ఫిక్స్ అయిందని.. ఇప్పుడు ఏకంగా ఓపెనింగ్ డేట్ కూడా వచ్చేసిందని వార్తలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ మారుతి సినిమా ఓపెనింగ్ డేట్ ఇదే అంటూ ఓ వార్త బయటికొచ్చింది. అన్ని అనుకున్నట్లు జరిగితే మరో ఆరు రోజుల్లోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందట. అదిరథమహారథుల మధ్య ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టబోతున్నారని  వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ అగ్ర నిర్మాత డివివి దానయ్య నిర్మాణంలో ఈ ప్రాజెక్టు తెరకెక్కనుంది. ఇక ఈ నెల 10వ తేదీన ప్రభాస్, మారుతి సినిమాకూ ముహూర్తపు షాట్ పడబోతోందట.

అంతేకాదు ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశముందని అంటున్నారు. ఆయనతోపాటు దర్శక దిగ్గజం రాజమౌళి కుటుంబ సమేతంగా హాజరు కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా సినిమా గురించి బయటకు చెప్పకపోయినా ప్రస్తుతం మారుతి మాత్రం ఈ సినిమా కథకు తుదిమెరుగులు దిద్దే పనిలో ఉన్నారట. సినిమాకు మొదట 'రాజా డీలక్స్' అనే టైటిల్ అనుకున్నట్లు  వార్తలు వచ్చిన విషయం తెలిసిందే కదా. అయితే ఆ టైటిల్ వేరొకరి దగ్గర ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో టైటిల్ మార్చే పనిలో ఉన్నాడట మారుతి. ఇప్పటివరకు వచ్చిన వార్తల ప్రకారం చూస్తే ఇదో హారర్ కామెడీ సినిమా అని తెలుస్తోంది.

బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఈ సినిమాలో దెయ్యాల రాజుగా కనిపిస్తాడట. అనుకోని పరిస్థితుల్లో దెయ్యాల బంగ్లా లోకి వెళ్ళిన హీరో అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అనేది ఈ సినిమా కథాంశం అని అంటున్నారు. అంతే కాదు ఇందులో ఏకంగా ప్రభాస్ కి జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని సమాచారం. ఒకవైపు తనకి తుదిమెరుగులు దిద్దుతూనే మరోవైపు హైదరాబాద్ నగరంలో ప్రత్యేకమైన సెట్స్ కూడా వేయిస్తున్నారట. వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేసే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉండగా.. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: