RC 15 : RRR కంటే డబుల్ యాక్షనట!

Purushottham Vinay
RRR సినిమా ఎంత పెద్ద ఘనవిజయం సాధించిందో చెప్పనవసరం లేదు. ముఖ్యంగా రామ్ చరణ్ నటనకు అయితే దేశావ్యాప్తంగా అభిమానులు పెరిగిపోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని శంకర్ చరణ్ తో చేయబోయే సినిమాలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇక కంటెంట్ పరంగా శంకర్ మార్క్ చిత్రంగా RC 15 తెరకెక్కుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక మరోసారి ఇదే విషయం తెరపైకి వస్తోంది. ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ మోడ్ పాత్రల్లో మెప్పించనున్నారని సన్నిహిత వర్గాల నుంచి లీకులందుతున్నాయి. అయితే ఈసారి డ్యూయల్ మోడ్ లో ఒక రోల్ పూర్తిగా ఛేంజ్ అయినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక పాత్రలో స్టూడెంట్ గా కనిపించనున్నారని ఇంకా మరో పాత్రలో జిల్లా కలెక్టర్ పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. `ఆర్ సీ 15` లో రెండు పాత్రల్ని చాలా బాగా డిజైన్ చేసినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఒక రోల్ ని పూర్తిగా యాక్షన్ హీరోగా ఎలివేట్ చేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి.




శంకర్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్ తో కట్టిపడేసాలా ఆ రోల్ డిజైన్ అయినట్లు సమాచారం అనేది వినిపిస్తుంది.ఒక పాత్ర నుంచి మరో పాత్రలోకి రామ్ చరణ్ ట్రాన్సపర్మేషన్ ఎగ్జైట్ మెంట్ తీసుకొస్తుందని గుసగుస వినిపిస్తుంది. అందులో శంకర్ మార్క్ కచ్చితంగా ఉంటుందని స్పష్టంగా చెప్పొచ్చు. ఇక శంకర్ స్ర్కిప్ట్ లు ఎప్పుడూ కూడా సొసైటీని ఇన్ స్పైర్ చేసేలా ఉంటాయి. ఇది అలాంటి కథాంశమేనని సమాచారం తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యూయల్ మోడ్ కి శంకర్ మార్క్ టచ్ అప్ తో పూర్తి కమర్శియల్ సినిమాగా హైలైట్ అవుతుందని అంటున్నారు. మరి అసలు సంగతేంటి? అన్నది ఈ సినిమా వచ్చేదాకా వెయిట్ చేస్తే గాని తెలియదు.ఇక ఈ  సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడీగా కియారా అద్వాణి నటిస్తోంది. యస్ యస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: