టైగర్ నాగేశ్వరరావు గుట్టు విప్పిన చిరంజీవి !
తాను చిన్నప్పుడు చీరాలలో ఉన్నప్పుడు టైగర్ నాగేశ్వరరావు గురించి కథలు కథలుగా చాలామంది చెప్పుకోవడం విన్నానని అప్పటి విషయాలను బయటపెట్టాడు. అంతేకాదు తన తండ్రి ఒకసారి టైగర్ నాగేస్వరావుని కలిసానని తనకు చెప్పడం గుర్తు అని అంటూ అప్పటి జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయాడు. ఇక ఈమూవీ కథను దర్శకుడు వంశీ తనకు కరోనా లాక్ డౌన్ సమయంలో చెప్పాడని తనకు ఆకథలో నటించే ఉద్దేశ్యం ఉన్నప్పటికీ అప్పటికే అనేక సినిమాలు చేస్తూ ఉండటంతో నటించలేకపోయిన విషయాన్ని బయటపెట్టాడు.
అయితే తన తమ్ముడు రవితేజా నటిస్తూ ఉండటంతో ఆమూవీలో తానే నటిస్తున్నాను అన్న ఫీలింగ్ కలిగిందని రవితేజాకు ఆపాత్ర బాగా సరిపోఅతుంది అంటూ కామెంట్స్ చేసాడు. ఈమూవీ ద్వారా రేణు దేశాయ్ మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈమూవీ హిట్ అయితే మళ్ళీ రేణు దేశాయ్ కెరియర్ కు బ్రేక్ వచ్చే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాలలో రాబిన్ హుడ్ లా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరావు అప్పట్లో ధనవంతుల దగ్గర దోచుకుని పేదవారికి ఇస్తూ ఉండేవాడు అన్న కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రేక్షకులు బయోపిక్ మూవీలను బాగా చూస్తున్నారు. అయితే ఆ బయోపిక్ ను కొంచం ఆశక్తిగా తీయగలిగితే ఆమూవీకి వందల కోట్లల్లో కలక్షన్స్ వస్తున్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మాస్ మహారాజా ఈమూవీని ఒక యంగ్ డైరెక్టర్ ను నమ్ముకుని చేస్తున్నాడు అనుకోవాలి. ఈమధ్య కాలంలో తీస్తున్న బయోపిక్ మూవీలకు బయ్యర్ల దగ్గర నుండి కూడ బాగా స్పందన వస్తూ ఉండటంతో ఇలాంటి కథలకు మంచి డిమాండ్ ఏర్పడింది..