మహేష్-రాజమౌళి సినిమా పై వస్తున్న వార్తలపై నిజం లేదా..!!

Divya
మహేష్ ప్రస్తుతం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటించడం జరుగుతోంది. ఇక మహేష్ పక్కన కీర్తి సురేష్ కూడా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చాలా వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ బాగా వైరల్ గా మారడమే కాకుండా ఈచిత్రంపై హైప్ ను పెంచాయి. ఇక ఈ చిత్రం కూడా వేసవి లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ చిత్రం అయిపోగానే త్రివిక్రమ్, రాజమౌళి డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారు.

త్రివిక్రమ్ తో కలిసి నటించాల్సిన సినిమాలో పలు పూజా కార్యక్రమం పనులు కూడా పూర్తి అయ్యాయి. ఇందులో పూజ హెగ్డే మరొకసారి మహేష్ తో జత కట్టనుంది. ఇక పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు పొందిన రాజమౌళి మహేష్ తో ఒక సినిమా చేయబోతున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఒక విషయం బయటికి వెలువడింది. అయితే ఈ చిత్రం పై వస్తున్న బడ్జెట్ వార్తలపై మరొక వార్త వినిపిస్తోంది.. అదేమిటంటే ఈ చిత్రానికి 800 వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నరని వార్త వినిపిస్తోంది కానీ ఇది కేవలం అభిమానుల  యొక్క ఊహాగానాలు అన్నట్లుగానే ఇండస్ట్రీలో టాక్  వినిపిస్తోంది.

ఈ విషయాలపై అభిమానులు, ప్రేక్షకులు సైతం ఊహించుకుని ఉంటారని అభిప్రాయపడుతున్నారు. అయితే పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర బృందం తెలియజేసింది. అయితే మహేశ్,రాజమౌళి కాంబోలో సినిమా రాబోతోంది అంటే అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మహేష్  ఇమేజ్కు తగ్గట్టుగా.. ఆయన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా మహేష్ అభిమానులు ఎలా కోరుకుంటారో అలా చూపిస్తానని విజయేంద్రప్రసాద్, రాజమౌళి కూడా గతంలో తెలియజేశారు. మరి ఈ చిత్రం కోసం మహేష్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: