ఆర్ఆర్ఆర్ లో.. లేడీ స్కాట్ గా చేసిన నటికి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా?
సినిమాలోని చిన్న పాత్ర దగ్గరి నుండి నుంచి పెద్దపాత్ర వరకూ ప్రతీ పాత్రకు ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. ఇటీవలే త్రిబుల్ ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి రాజమౌళి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. భారీ వసూళ్లతో ప్రస్తుతం రికార్డులు సృష్టిస్తుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమాలో లేడీస్ స్కాట్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే త్రిబుల్ ఆర్ సినిమా లేడీ స్కాట్ పాత్ర తోనే మొదలవుతుంది. సదరు నటి ఆ పాత్రలో బాగా ఒదిగి పోయింది. ఇలా లేడీ స్కాట్ పాత్రలో చేసిన నటి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. లేడీస్ స్కాట్ పాత్రలో చేసిన నటికి భారీ బ్యాక్గ్రౌండ్ ఉందట.. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆమె పేరు అలిసన్ డూడి 1985లో సినిమా కెరీర్ ని మొదలు పెట్టింది. మోడలింగ్ నుండి నటి గా మారిపోయింది. ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె జేమ్స్ బాండ్ ఇలాంటి చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించి ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించింది అలిసన్ డూడి. అంతే కాదు అవెంజర్ సిరీస్ లోని థార్ అనే మూవీ లో కీలక పాత్రలో నటించింది. 1994 లో ఒక న్యూస్ ఛానల్ సీఈఓ గా ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతనికి విడాకులు ఇచ్చి 2011 లో ఒక వ్యాపారవేత్త తో రిలేషన్ షిప్ కొనసాగించింది. కానీ అతను హర్ట్ ఎటాక్ కారణంగా చనిపోయారు.దీంతో ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోంది అలిసన్ డూడి.