టాలీవుడ్ ను చూసి ఆశ్చర్యపోతున్న బాలీవుడ్..!

NAGARJUNA NAKKA
'పుష్ప' సినిమా హిందీలో వందకోట్లు వసూల్ చేసినప్పటి నుంచి బాలీవుడ్‌లో మాస్‌ మూవీస్‌ గురించి చర్చలు ఎక్కువయ్యాయి. కరోనా థర్డ్‌ వేవ్‌ భయంలోనూ 'పుష్ప-ది రైజ్' వందకోట్లు వసూల్ చేయడం, ఆ క్యారెక్టర్‌ని జనాలు ఓన్ చేసుకొని సోషల్‌ మీడియాలో తగ్గేదేలే అని రీల్స్‌ చెయ్యడంతో బాలీవుడ్‌లోనూ వైబ్రేషన్ మొదలైంది. పెద్దగా ప్రమోషన్‌ చేయలేకపోయినా.. బన్నికి బాలీవుడ్‌లో పెద్దగా స్టార్డమ్‌ లేకపోయినా ఇన్ని కోట్లు ఎలా వచ్చాయా అని అంతా ఆశ్చర్యపోయారు.
'పుష్ప' హిందీలో వందకోట్ల మార్క్‌ని రీచ్‌ కావడానికి బీ,సీ సెంటర్సే మెయిన్‌ రీజన్ అని తేల్చారు బాలీవుడ్‌ ట్రేడ్‌ పండిట్స్‌. ఇక లేటెస్ట్‌ తెలుగు రిలీజ్‌ 'ఆర్ ఆర్ ఆర్' పోస్ట్‌ పాండమిక్‌లో సరికొత్త రికార్డులు సృష్టించడంతో మళ్లీ కమర్షియల్‌ ఫార్ములా గురించి చర్చలు మొదలయ్యాయి. ఐఫా2022 అవార్డ్స్‌ ప్రెస్‌ మీట్‌లో సౌత్‌లా మేము కమర్షియల్‌ సినిమాలు తీయలేకపోతున్నామని చెప్పాడు.
'సాహో' సినిమాకి తెలుగులో పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా, హిందీలో మాత్రం భారీగా వసూల్ చేసింది. అక్కడ బ్లాక్‌బస్టర్ అయ్యింది. అయితే హిందీ నుంచి సౌత్‌కి వచ్చిన 'భారత్' లాంటి సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర నిలబడలేకపోయాయి. దీంతో సల్మాన్ ఖాన్‌ కూడా నార్త్‌ సినిమాలు సౌత్‌లో ఎందుకు వసూల్ చేయలేకపోతున్నాయో అర్థం కావడం లేదని చెప్పాడు.
కొన్నేళ్ల వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి బాలీవుడ్ పెద్దన్న అన్నట్టుగా  ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. 'బాహుబలి, కెజిఎఫ్' లాంటి హిట్స్‌తో అక్కడి మేకర్స్‌ కూడా ఆలోచనలో పడిపోయారు. హిందీ సినిమాలు సౌత్‌లో డబ్‌ చేసినా వసూళ్లు రావడం లేదు. అక్కడి సినిమాలకి ఇక్కడ వందలకోట్లు ఎలా వస్తున్నాయని పరిశోధనలు మొదలుపెట్టారు. సలీమ్‌ జావేద్‌ కాంబినేషన్‌లో బోల్డన్ని మాస్‌ సినిమాలు వచ్చాయి. ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్లు మాస్‌ మూవీస్‌తోనే భారీ స్టార్డమ్‌ సంపాదించుకున్నారు. కానీ ఆ తర్వాత రొమాంటిక్, లవ్‌ ఎంటర్‌టైనర్స్‌ పెరిగాక మాస్‌ మూవీస్‌ తగ్గాయి. హిందీ స్టార్స్‌ కూడా మల్టీప్లెక్స్‌ మార్కెట్‌కి తగ్గ సినిమాలు చేయడం మొదలుపెట్టారు.
బాక్సాఫీస్‌తో కమర్షియల్ మూవీస్‌కి లాంగ్‌ గ్యాప్‌ వచ్చిన రాజమౌళి 'బాహుబలి' రిలీజ్ చేశాడు. బిగ్గెస్ట్‌ గ్రాఫికల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమాకి అక్కడ భారీ వసూళ్లు వచ్చాయి. 'బాహుబలి-2' అయితే కేవలం హిందీ మార్కెట్‌లోనే 500 కోట్లకి పైగా వసూల్ చేసి రికార్డులు సృష్టించింది. ఈ వసూళ్లతో రాజమౌళి అక్కడ ఒక బ్రాండ్‌లా మారిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: