వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా? ఈ విషయం తెలుసుకోండి..!

lakhmi saranya
కాస్త వర్షం కురిసినా, వాతావరణం చల్లగా ఉన్న శరీరం వచ్చేదనాన్ని కోరుకుంటుంది. అంతే స్నానం మొదలు ఆహారం వరకు అన్ని వేడి పదార్థాలతోనే స్నేహం చేస్తాం. ఇది అంత మంచి అలవాటు కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఊరు వెచ్చని వరకు పర్లేదు.. మరింత వేడిగా అంటే లేనిపోని ఆహార సమస్యలకు ఆహ్వాని పలికినట్లే అవుతుందట. చలికాలంలో శరీరం, మనసు వెచ్చగా ఉండేందుకు ఇష్టపడుతుంది. దీంతో వేడి ఆహారాన్ని తినాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చల్లటి వాతావరణం వల్ల శరీరం వెచ్చగా ఉండాలంటే వేడివేడి ఆహారాన్ని తినాలను కోవడం సహజం.
మీకు కూడా ఈ అలవాటు ఉంటే ఈరోజే వదిలేయడం మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేడిగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తింటే శరీరంలోని అనేక భాగాలను దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అతిగా వేడి చేసిన ఆహారం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా నాలుకకు కూడా హానికరం. వేడిగా ఉండే ఆహారం తింటే నాలుక కూడా మండుతుంది. నాలుక చాలా సున్నితంగా ఉంటుంది. వేడి ఆహారాన్ని తినడం వల్ల కొన్ని రోజుల వరకు ఆహారాన్ని రుచి చూడలేరు. అంతేకాకుండా, చాలా వేడి ఆహారాన్ని తీసుకోవడం వల్ల గొంతులో వాపు సంభవిస్తుంది.
కడుపు లోపల చర్మం సున్నితంగా ఉంటుంది. వెచ్చని ఆహారాన్ని శరీరం త్వరగా అంగీకరించదు. దీన్ని తీసుకోవటం వల్ల కడుపు నొప్పి, బళ్లు నొప్పులు తదితర సమస్యలు వస్తాయి. గ్యాస్ సమస్యతో పాటు పేగులు దెబ్బతింటాయి. కాబట్టి వీలైనంత తక్కువ వేడి ఉన్న ఆహార పదార్థాలను తినటం ఆరోగ్యానికి మంచిది. వేడి ఆహారం తినటం, వేడి సూప్ తాగటం వల్లంతాలు దెబ్బ తింటాయి. వారం వేడిగా ఉన్నందున, ఎనామెల్ పై పగుళ్లు ఏర్పడుతుంది. ఇది శాశ్వతం నష్టాన్ని కలిగిస్తుంది. వేడి ఆహారాన్ని ఎంత తక్కువ తింటే అంత మంచిది. వేడి ఆహారం ఎక్కువగా తినటం వల్ల మీ ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: