ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. రామరాజు, భీమ్ పాత్రలకు ప్రాణం పోసిన చరణ్, తారక్ లను నెటిజన్లు అందరూ తెగ మెచ్చుకుంటున్నారు.
ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత ఒక ఆంగ్ల పత్రికతో ముచ్చటించిన తారక్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారట.. ఇకనుంచి ఆర్ఆర్ఆర్ మూవీకి ముందు ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత అని తన కెరీర్ గురించి మాట్లాడుకుంటారని తారక్ అన్నారట.. ఆర్ఆర్ఆర్ మూవీ తన కెరీర్ లోనే స్పెషల్ మూవీ అని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు కూడా చేశారు.
ఆర్ఆర్ఆర్ లో తన ఇంట్రడక్షన్ సీన్లు ఎంతో స్పెషల్ గా ఉన్నాయని చాలామంది చెబుతున్నారని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారట.. ఆర్ఆర్ఆర్ మూవీ తననుంచి నటుడిగా ఎంతో శ్రమను కోరుకుందని ఎన్టీఆర్ వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ లో నటించినందుకు తాను గర్వపడుతున్నానని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ నాకు నూతన ఆరంభాన్ని అందించిందని ఎన్టీఆర్ అన్నారు. సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ ను చూస్తే ప్రేక్షకులు ఈలలు వేస్తూ చప్పట్లు కొడతారని
ఆర్ఆర్ఆర్ మూవీలో తన ఇంట్రడక్షన్ సీన్లను చూస్తే మాత్రం కొమురం భీమ్ గురించి పూర్తి అవగాహన వచ్చే విధంగా ఆ సీన్లు ఉన్నాయని ఎన్టీఆర్ వెల్లడించారు. ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ మూవీ చూస్తూ ఎంజాయ్ చేసిన వీడియోలను చూసి తాను ఆనందించానని ఎన్టీఆర్ వెల్లడించారు. జక్కన్న ఆడియన్స్ పల్స్ ను ఏ విధంగా పట్టుకుంటారని ఆలోచించానని ఎన్టీఆర్ పేర్కొన్నారు. నా దృష్టిలో సినిమాల గురించి మాట్లాడాలంటే మొదట ప్రశంసలకు ప్రాధాన్యత ఇస్తానని ఆ తర్వాత రివ్యూలకు, చివరిగా బాక్సాఫీస్ కలెక్షన్లకు ప్రాధాన్యత ఇస్తానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
బాక్సాఫీస్ కలెక్షన్లతో నాకు ఎటువంటి సంబంధం ఉండదని బాక్సాఫీస్ కలెక్షన్లు పెరిగితే నటీనటులకు ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని ఎన్టీఆర్ కామెంట్లు చేశారు. ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.