నందిని రెడ్డి తో అప్పుడు సమంత ఇప్పుడు చైతు..!!

Divya
టాలీవుడ్ లో లేడీ డైరెక్టర్ల బాగా రాణిస్తున్న మహిళ ఎవరంటే నందిని రెడ్డి అని చెప్పవచ్చు. అయితే మరిన్ని సక్సెస్ ల కోసం తన వంతు ప్రయత్నంగా చేస్తూనే ఎప్పటికప్పుడు బిజీ గానే ఉంటుంది. ఇక ఇటీవలే సమంత ముఖ్యమైన పాత్రలో నటించిన ఓ బేబీ వంటి సినిమాని తెరకెక్కించింది. ఈ సినిమా ఒక ప్రయోగాత్మక కంటెంట్తో విదేశీ చిత్రాన్ని రీమేక్ చేయడం జరిగింది ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది నందినిరెడ్డి. అయితే ఇప్పుడు తాజాగా మరో హీరోతో సినిమా చేయడానికి సిద్ధమైంది వాటి గురించి చూద్దాం.
ఇక ఇప్పుడు అక్కినేని హీరో నాగచైతన్య తో కలిసి ఒక సినిమాని చేసేందుకు సిద్ధమైంది నందినిరెడ్డి. ఇప్పటికే అందుకు సంబంధించి కథను కూడా వినిపించింది. దాంతో చైతన్య కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే ఇదివరకే సమంతతో కలిసి జబర్దస్త్ వంటి సినిమాను తెరకెక్కించింది ఈమె ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు.. ఆ తర్వాత ఓ బేబీ సినిమా చేయడానికి చాలా కాలం వేచి ఉన్నది. కానీ నాగచైతన్య సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఇంకా తెలుపలేదు. చైతన్య ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంటూ ఉన్నారు.
ప్రస్తుతం డైరెక్టర్ విక్రమ్ కే తో దూత, థాంక్యూ, బాలీవుడ్లో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో అయిపోయిన వెంటనే ఒక పీరియాడికల్ మూవీ లో వెంకటేష్ ప్రభు డైరెక్షన్లో ఒక సినిమాలో నటించబోతున్నారని వినిపిస్తోంది. అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే ఈ లేడీ డైరెక్టర్ తో సినిమా ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని వైజయంతీ బ్యానర్ పై అశ్వనీదత్ స్వప్న దత్ కలిసి నిర్మిస్తున్నట్లు గా తెలుస్తోంది. ఏదిఏమైనా నాగచైతన్య ప్రస్తుతం తన అభిమానులను దృష్టిలో పెట్టుకొని పెంచుకునే కధలకు ప్రాధాన్యత ఉండే కథలనే తెరకెక్కిస్తే ఫ్యాన్స్ ను ఫుల్ కుషి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: