స్టేజ్ మీదే కమెడియన్ ను కొట్టిన స్టార్ హీరో?

VAMSI
అతడు వేసిన జోక్ తనకి నచ్చలేదని తన భార్యని అవమానించినట్లు అనిపించిందని ఒక కమెడియన్ చెంప పల్లున పగలకొట్టాడు ఆ హీరో. తన భార్య పై సరదాగా ఒక మాట తూలినందుకు వేలాది మంది జనం చూస్తున్నా don't కేర్ అన్నట్లుగా స్టేజ్ పైకి పరుగులు తీసి మరి ఆ కమెడియన్ కు తనదైన శైలిలో ఘాటుగా స్పందించాడు. అసలు విషయం ఏమిటంటే, అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభం అయ్యింది. అమెరికాలోని లాస్ ఏంజిలిస్‌లో గల డాల్బీ థియేటర్ వేదికగా..ఈ ప్రోగ్రాం గ్రాండ్ గా ఆరంభం అయ్యింది. స్టేజ్ పై అవార్డ్ కార్యక్రమంగా అట్టహాసంగా జరుగుతోంది.

ఈ క్రమంలో హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ కు "కింగ్ రిచర్డ్"  సినిమాకి గాను ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు కు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ అవార్డు అందించడానికి స్టేజ్ పైకి పిలిచారు. మొదట - స్టేజీ పైకి వచ్చిన కమెడియన్ క్రిస్ రాక్.. తనదైన స్టైల్ లో అందరినీ నవ్వించారు. అతను వేసిన జోక్స్‌కు విల్ స్మిత్, ఆయన భార్య జేడ్ పింకెట్ స్మిత్ సైతం కూడా పడి పడి నవ్వారు. అయితే నేరుగా విల్ స్మిత్ భార్య పైనే ఒక చిన్న జోక్ వేయడంతో దాని ఈజీగా తీసుకోకపోయినా హీరో విల్ స్మిత్ స్టేజ్ పైకి పరుగులు తీసి మరి నలుగురు చూస్తూ ఉన్నారు అన్న విషయాన్ని పక్కన పెట్టి క్రిస్ చెంప చెల్లు మనిపించాడు.

అంతేకాదు నా భార్య గురించి మరో మారు మాట్లాడితే బాగుండదని వార్నింగ్ కూడా ఇచ్చారట. నా భార్య పేరు కనీసం నీ నోట పలకకూడదు అని స్ట్రాంగ్ గానే చెప్పారట విల్ స్మిత్. ఈ గొడవతో ఆక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం ఒక్కసారిగా హాట్ హాట్ గా మారింది. మళ్ళీ  కాసేపటికి అంతా సర్దుకుంది తిరిగి క్రిస్ తన శైలి లోకి వచ్చేశారు. మళ్ళీ అందరినీ నవ్వించే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఘటన తర్వాత క్రిస్ తనపై కేసు పెడతాడని అంతా అనుకున్నారు. కానీ ఇందుకు క్రిస్ ఒప్పుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: