కొత్త కాంబినేషన్లో హీరోల కొత్త సినిమాలు ఇవే..!
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమాను పూర్తీ చేశారు.జనగణమన' కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే చేస్తున్నారు. ఆ సినిమాతో పాటు దర్శకుడు శివ నిర్వాణతో ఓ సినిమాకు సైన్ చేశారు. కాశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విజయ్ ఆర్మీ అధికారి పాత్రలో కనిపించనున్నారు.. ఆ సినిమాలో విజయ్ సరసన సమంత నటిస్తుంది. ఇకపోతే రష్మిక మందన్న కూడా చేతిలో బోలెడు సినిమాలతో బిజిగా ఉంది. శర్వా కు జోడిగా ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా లో నటించింది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తమిళ హీరో విజయ్ నటిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలో రష్మికను కథానాయికగా తీసుకున్నారట..ఇది కాక వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వస్తున్న సినిమాకు సైన్ చేసింది.
ఇటీవల ఎంట్రీ ఇచ్చి మంచి టాక్ ను అందుకున్న కృతిశెట్టిపై టాలీవుడ్, కోలివుడ్ హీరోల దృష్టి పడింది. తొలి చిత్రం 'ఉప్పెన' సక్సెస్‌తో ఈ అమ్మడు ఒక్కసారిగా క్రేజ్ తో పాటు బిజీ అయిపోయింది. తమిళ హీరో సూర్య సరసన కృతిశెట్టి కథానాయికగా చేయనున్నారనే వార్త చక్కర్లు కోడుతుంది.. ఇకపోతే ప్రభాస్, పవన్ కళ్యాణ్ లకు జోడిగా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్ లో నటిస్తున్నారు.. ఆ సినిమా త్వరలోనే సెట్స్ పై వెల్లనుంది. స్టార్ హీరో వెంకీ ఎఫ్ 3' షూటింగ్ పూర్తి చేశారు. ఇప్పుడు వెబ్ సిరిస్ లో నటిస్తున్నారు. ప్రభాస్ కూడా వరుస సినిమాల తో బిజిగా ఉన్నారు.