ఏ మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది ముందే రాసిపెట్టి ఉంటుంది...పూజా హెగ్డే..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక లైలా కోసం సినిమా తో  మంచి క్రేజ్ సంపాదించుకుంది.  ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు దక్కించుకున్న పూజా హెగ్డే అతి కొద్ది కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది,  ఇది ఇలా ఉంటే పూజా హెగ్డే బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది,  పూజా హెగ్డే కేవలం సినిమాల్లో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా రంగస్థలం సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించి ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది.  ఇది ఇలా ఉంటే పూజా హెగ్డే తాజాగా ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధే శ్యామ్ మూవీ లో  హీరోయిన్ గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే,  ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మార్చి 11 వ తేదీన ధియేటర్ లలో విడుదల అయ్యింది.  పసం ఇండియా మూవీ గా తెరకెక్కిన రాధే శ్యామ్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున మార్చ్ 11 వ తేదీ న విడుదల అయ్యింది,  విడుదల అయిన  మొదటి రోజు నుండే ఈ మూవీ మిక్సీడ్  టాక్ ను సొంతం చేసుకుంది,  తొలి రోజున 79 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ మూవీ మూడు రోజుల్లో 151 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.


  వీకెండ్ తరువాత ఈ మూవీ గ్రాఫ్ అన్ని ప్రాంతాల్లో తగ్గుతూ వెళ్లింది,   ఈ నేపథ్యంలో తాజాగా పూజా హెగ్డే మాట్లాడుతూ... కొన్ని మూవీ లు ఓకే అనిపించినా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా పెర్ఫార్మ్ చేస్తాయి,  మరి కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా పెర్ఫార్మ్ చేయకపోయినా అవి బాగానే అనిపిస్తాయి.  ఎ మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది ముందుగానే రాసి పెట్టి ఉంటుంది ,  అలాగే జరుగుతుంది , అంతే అంటూ పూజా హెగ్డే తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: