ఈ సారైనా రాజ్ తరుణ్ కి కలిసొస్తుందా..?

Divya
హీరో రాజ్ తరుణ్ ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాప్ లను చవిచూస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వచ్చిన అనుభవించు రాజా సినిమా కూడా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు. దీంతో మళ్లీ ఫ్లాఫ్ లో పడిపోయాడు. ఇప్పుడు మరొక సారి స్టాండప్ రాహుల్ అంటూ మన ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమా కథ రాసుకునేటప్పుడు సాధారణంగా మనసులో మా హీరో ఉన్నాడు అని దర్శకులు అనుకుంటూ ఉంటారు. కొత్త దర్శకుల నుండి స్టార్ దర్శకుల వరకు చాలామంది ఇలాంటి మాటలు చెబుతూ ఉండటం మనం వినే ఉంటాం. సినిమా కథ అంతా రెడీ అయిన తర్వాత హీరో ఎవరైతే బాగుంటారు అనుకుని.. అందుకోసం ఒక పెద్ద లిస్టు రాసుకొని ఆఖరి పేరు రాసిన హీరోతోనే సినిమా చేస్తే.. కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నా.. వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
ఇప్పుడు చెప్పింది కూడా రాజ్ తరుణ్ గురించి.. శుక్రవారం రిలీజ్ కాబోతున్న స్టాండప్ రాహుల్ సినిమా గురించి దర్శకుడు ఈ విషయాన్ని వెల్లడించారు. కథకు హీరోగా ఎవరు బాగుంటారు అని నిర్మాతలను అడిగితే 10 పేర్లతో లిస్టు ఇచ్చారట. నిజానికి రాస్తున్నప్పుడు ఆయనకు తొమ్మిది పేర్లు మనసులో తట్టాయి. ఆఖరి పేరు కూడా ఇవ్వాలి అని అనిపించినప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే యంగ్ హీరో  రాజ్ తరుణ్ పేరు వచ్చిందట. పదవ పేరుగా రాజ్ తరుణ్ పేరు లిస్ట్ లో యాడ్ చేసి నిర్మాతలు ఇవ్వగా నిర్మాతలు అందరితో మాట్లాడి చివరికి రాజ్ తరుణ్  దగ్గరికి వచ్చి ఆగాము.

ఆయన కూడా యాక్సెప్ట్ చేయడం సినిమాను పట్టా లెక్కించడం జరిగింది.  ఈ సినిమాకోసం ఛాయిస్  లేకపోయినా అతడే ఛాన్స్ కొట్టడం గమనార్హం అని దర్శకుడు తెలియజేశాడు. అంతేకాదు ఈ సినిమాలో రాజ్ తరుణ్ విషయంలో కూడా దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు రాజ్ తరుణ్ ఇలాంటి మేకప్ లో ఎవరు చూడలేదట. పక్క విలేజ్ .. అల్లరి కుర్రాడిలా కనిపించే ఈయన ఈసారి కొత్తగా కనిపించబోతున్నాడట .. మరి ఈసారైనా హిట్ కొడతాడో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: