ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్..

Satvika
నందమూరి వారసుడు అంటే అందరికి గుర్తుకు వచ్చే పేరు జూనియర్ ఎన్టీఆర్.. స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, యమదొంగ ఇలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల ను తెలుగు ప్రేక్షకులకు అందించారు.. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన మరి కొన్ని సినిమాలు మాత్రం నందమూరి అభిమానులకు ఫుల్ ఖుషి చేశాయి. అందుకే ఎన్టీఆర్ ను సీనియర్ ఎన్టీఆర్ తో సమానంగా చూస్తారు. అంతే అభిమానం తో ఆదరిస్తున్నారు..ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నారు..


ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా గా ప్రేక్షకుల ముందుకు రానుంది. కరోనా కారణంగా ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మార్చి 25న విడుదల కానుంది. అయితే సినిమా విడుదల అనుకున్న ప్రతిసారి వాయిదా పడటం వల్ల అభిమానులు కూడా లైట్ తీసుకున్నారు. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' నుంచి విడుదల అయిన పాటలు, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. సినిమా విడుదల కు మరో రెండు వారాలు మాత్రమే ఉండటం తో సినిమా ప్రమోషన్స్ లో జక్కన్న స్పీడ్ ను పెంచారు.


కాగా, ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం గతంలో భారీగా ఖర్చు పెట్టగా మరోసారి ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈక్రమంలోనే 'ఆర్ఆర్ఆర్' టీం నుంచి కొత్త పాట రానుంది. మార్చి 14న ఎత్తరా జెండా అనే పాటని విడుదల చేశారు. ఆ పాటలో ముగ్గురూ అదరగొట్టిన సంగతి తెలిసిందే.. ముగ్గురూ స్వతంత్ర సమరయోధులను గుర్తు చేస్తూ నటించగా.. ఆ పాట లో ఎన్టీఆర్ రెండు సార్లు పంచె లో కనిపించారు. అది చూసిన వారంథ  కూడా సీనియర్ ఎన్టీఆర్ లాగా ఉన్నారని నందమూరి అభిమానులు అంటున్నారు.. మరి సినిమా ఎలా వుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: