ప్రభాస్ కు జోష్ ను ఇవ్వబోతున్న దుబాయ్ ఈవెంట్ !

Seetha Sailaja
అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ‘రాథే శ్యామ్’ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో షాక్ అయిన ప్రభాస్ కు దుబాయ్ లో జరగబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జోష్ ను ఇచ్చే విధంగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్ లో చరణ్ జూనియర్ లతో పాటు ప్రభాస్ కూడ పాల్గొనబోతున్నాడు.


‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో తనకు కనీసం అతిధి పాత్ర అయినా క్రియేట్ చేయలేకపోయినందుకు జక్కన్న పై కోపంగా ఉంది అంటూ ఈమధ్య ‘రాథే శ్యామ్’ ఇంటర్వ్యూలో డైరెక్ట్ గానే ప్రభాస్ రాజమౌళితో చెప్పాడు. ఈ అనుకోని కామెంట్ కు రాజమౌళి ఆ ఇంటర్వ్యూలో ఎదో ఒక సమాధానం చెప్పి తప్పించుకున్నప్పటికీ  దేశవ్యాప్తంగా ప్రసారం కాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ దుబాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ కు కూడ స్థానం కల్పించి అతడికి జోష్ ను కలిగించాలని జక్కన్న ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.


ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం రాజమౌళికి దుబాయ్ లో ఈవెంట్ ను అత్యంత ఘనంగా చేయమని సలహాయిచ్చింది ప్రభాస్ అని అంటున్నారు. ప్రభాస్ ఎప్పుడు ఫ్లాప్స్ లో ఉన్నా ఒక హిట్ ఇవ్వడం రాజమౌళి అలవాటు. ‘వర్షం’ తరువాత ప్రభాస్ వరస ఫ్లాప్స్ తో సతమతమైపోతున్నప్పుడు ‘ఛత్రపతి’ మూవీ తీసి ప్రభాస్ ఇమేజ్ ను రాజమౌళి పెంచాడు. ఇక ‘బాహుబలి’ తో ప్రభాస్ ను నేషనల్ స్టార్ గా చేసిన విషయం తెలిసిందే.


మళ్ళీ ప్రభాస్ రాజమౌళిల కాంబినేషన్ లో మూవీ ఎప్పుడు ఉంటుందో తెలియకపోయినా ప్రస్తుతం నిరాశలో ఉన్న ప్రభాస్ కు మరొకసారి జాతీయ మీడియాలో ఎలివేషన్ రావడానికి చాల వ్యూహాత్మకంగా రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ ఈవెంట్ లో ప్రభాస్ ను కలుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థిఒతులలొ భారీ సినిమాలలో సౌండ్ సిస్టం కూడ కీలక పాత్ర పోషిస్తోంది. ఈనేపధ్యంలో ‘ఆర్ ఆర్ ఆర్’ కు మరింత క్రేజ్ రావడానికి దేశంలోనే తొలి డాల్బీ సినిమా అంటూ తాజాగా ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే..




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: