సర్దార్ పాపారాయుడుతో పోటీపడి ఓడిన సినిమాలు.. ఏంటో తెలుసా..!

MOHAN BABU
22 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకొని, 5 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకొని,3 కేంద్రాల్లో 200 రోజులు,2 కేంద్రాల్లో 300 రోజులు ఆడి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన సర్దార్ పాపారాయుడు సినిమాకి తక్కువ గ్యాప్ తో పోటీగా వచ్చినా సినిమాలు, జయాపజయాల గురించి తెలుసుకుందాం. ఈ సినిమాలో తెలంగాణ పోరాట యోధుడు సర్వాయి పాపన్న జీవితాన్ని ప్రేరణగా తీసుకొని కొంత కల్పిత కథాంశంతో, కమర్షియల్ హంగు ఆర్భాటాలను చేకూర్చి దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి డైరెక్షన్ లో అద్భుతంగా జరిగిన చిత్రం  సర్దార్ పాపారాయుడు. డ్యూయెల్ రోల్ చేసిన ఈ మూవీలో హీరోయిన్ శ్రీదేవి తో వచ్చిన లవ్ సీన్స్ చాలా చబ్బీగా ఆకట్టుకుంటాయి.

 ఇక పాపారాయుడు గా ఎన్టీఆర్ నటన ఒళ్ళు గగుర్లు పొడిచేలా ఉంటుంది. దేశ క్షేమం కోసం బ్రిటిష్ వాళ్ళతో,అలాగే స్వదేశంలో ఉండే చీడపురుగుల లాంటి వ్యక్తుల తో అతను పోరాడే విధానం ఇలా తెరకెక్కిన ఈ మూవీలో ప్రశాంతంగా నిలిచే పాటలను ఇచ్చి ఆకట్టుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి. ఈ మూవీ మొత్తం ఫస్ట్ డే 5 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించగా, ఫస్ట్ వీక్ లో 29 లక్షలు ఓవరాల్ గా రెండు కోట్లకు పైనే కలెక్ట్ చేసి ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాంటి ఈ మూవీకి పోటీగా రెండు వారాల గ్యాప్ తో వచ్చిన సినిమాలు వాటి ఫలితాలేంటో తెలుసుకుందాం. సర్దార్ పాపారాయుడు కి రెండు వారాల ముందుగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన హరే కృష్ణ హలో రాధ మూవీ వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. ఇక కృష్ణ గారిదే మరో మూవీ కూడా వచ్చింది అదే మా ఇంటి దేవత. సర్దార్ పాపారాయుడు సినిమా వచ్చిన రెండు రోజులకు ఈ సినిమా వచ్చింది. ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక మరో మూవీ ప్రేమ తరంగాలు. సర్దార్ పాపారాయుడు కి ఆరు రోజుల ముందు కృష్ణంరాజు, చిరంజీవి నటించిన ఈ మూవీ లో సుజాత,జయసుధ హీరోయిన్లు. ఇది బాక్సాఫీస్ వద్ద పరాజయాన్నే చూసింది. లవ్ బేస్ కాన్సెప్ట్ తో ట్రాజెడిక్ గా వచ్చిన ఈ మూవీకి డైరెక్టర్ ఎస్పీ చిట్టి బాబు. సర్దార్ పాపారాయుడు వచ్చిన 12 రోజులకి వచ్చిన సినిమా  మొగుడు కావాలి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. కథా కథనం మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఆడియో అలరించింది.

గాయత్రి ఇందులో హీరోయిన్. ఇక ఎన్టీఆర్ సర్దార్ పాపారాయుడు కి రెండు వారాల తర్వాత ఎన్టీఆర్ నటించిన మరో సినిమా సరదా రాముడు. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయింది. ఇలా మొత్తంగా సర్దార్ పాపారాయుడు వంటి బ్లాక్ బస్టర్ తో ఎన్టీఆర్  నెంబర్ వన్ పొజిషన్లో ఉండగా దానికి రెండు వారాల గ్యాప్ తో వచ్చిన మొగుడు కావాలి సినిమా తో చిరంజీవి కూడా విజయాన్ని అందుకొని రెండవ పొజిషన్లో నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: