ఆనందంలో అభిమానులు.. ఆయన మరణించిన 700 రోజులకి సినిమా విడుదల?

praveen
కొన్నేళ్ల నుంచి చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదకర ఘటన లు అటు ప్రేక్షకులందరినీ కూడా శోకసంద్రంలో ముంచేస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా తమ అభిమాన నటులు దూరం అయిన తర్వాత వారి జ్ఞాపకాలు లోనే ఉంటారు అభిమానులు. ఈ క్రమంలోనే వారికి సంబంధించిన సినిమాలు ఏవైనా విడుదలయ్యాయి అంటే చాలు ఎంతో ఆనంద పడిపోతూ వుంటాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ దిగ్గజం నటుడు రిషీకపూర్ అభిమానుల్లో ఇలాంటి ఆనందమే నెలకొంది.

 ఎన్నో ఏళ్ల పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తన హవా నడిపించిన రిషి కపూర్ ఆ తర్వాత కాలంలో కూడా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తొలితరం హీరో రాజ్ కపూర్ వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు రిషీకపూర్. ఇక అప్పట్లో వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు ఆయన. ఇక ఆయన చనిపోయేముందు చివరిగా నటించిన సినిమా శర్మాజీ నమ్ కిన్ సినిమా. మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని తెలుస్తోంది.

 2020 ఏప్రిల్ 30వ తేదీన అనారోగ్యంతో చికిత్స పొందుతూ రిషీకపూర్ చివరికి మృతి చెందారు అన్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులు అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే రిషీకపూర్ మరణించినా దాదాపు 700 రోజుల తర్వాత ఇక ఆయన నటించిన చివరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది ఇక రిషీకపూర్ మరణించే సమయానికి ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. అయనపై చేయాల్సిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి.  దీంతో మరో నటుడు పరేష్ రావల్ తో పూర్తి చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా మార్చి 31వ తేదీన అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కాబోతుంది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: