తనలోని బలహీతలను బయటపెట్టిన ప్రభాస్ !

Seetha Sailaja
ఈవారం విడుదల కాబోతున్న ‘రాథే శ్యామ్’ రిజల్ట్ గురించి ప్రభాస్ చాల ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ‘బాహుబలి’ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ తన ఇమేజ్ కి భిన్నంగా ఒక లవ్ స్టోరీని ఎంపిక చేసుకుని తనకు తానే సాహసం చేసుకున్నాడు అంటూ వస్తున్న కామెంట్స్ పై ప్రభాస్ స్పందించాడు.

‘రాథే శ్యామ్’ ను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈ కామెంట్స్ చేసాడు. ప్రస్తుతం తనకు ఏర్పడిన ఇమేజ్ నేపధ్యంలో ఒక ప్యూర్ లవ్ స్టోరీ చేయడం సాహసం అని తనకు తెలుసు అని అంటూ గతంలో తాను నటించిన 'డార్లింగ్’ ‘మిష్టర్ పర్ఫెట్’  ‘వర్షం’ సినిమాలలో తనను ప్రేక్షకులు ఆదరించినట్లుగా 'రాథే శ్యామ్’ ను కూడ ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం తనకు ఉన్నప్పటికీ ఎక్కడో రిస్క్ చేస్తున్నాను అన్నభయం తనకు ఉంది అంటూ కామెంట్ చేసాడు.

ఇక తన అభిమానుల గురించి మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలు దాటినా ఇంకా తనకు స్టేజ్ ఎక్కి మాట్లాడాలి అంటే సిగ్గు పడతానని తన పై తానే జోక్ చేసుకున్నాడు. తన అభిమానులతో ఎక్కువ మాట్లాడకపోయినా తాను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోయినా తన గురించి ప్రాణం ఇచ్చే అభిమానులను తలుచుకున్నప్పుడల్లా అది తన పూర్వజన్మ అదృష్టం అనిపిస్తుంది అంటూ ఈమూవీ తన అభిమానులకు బాగా నచ్చితే మరిన్ని లవ్ స్టోరీకి సంబంధించిన సినిమాలు చేయాలని తన కోరిక అని అంటున్నాడు.

వాస్తవానికి ‘రాథే శ్యామ్’ మూవీ పై అభిమానులలో కూడ కొన్ని సందేహాలు ఉన్నాయి. యాక్షన్ సీన్ సినిమాలకు అలవాటుపడిన సగటు ప్రేక్షకుడు ప్రభాస్ ను ప్రేమికుడుగా ఎంతవరకు ఆదరిస్తారు అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఈవిషయాలు అన్నీ తన దృష్టి వరకు రావడంతో ‘రాథే శ్యామ్’ లో నటించడం ఒక సాహసం అంటూ ముందుగానే తన అభిమానులను మానసికంగా సిద్ధం చేస్తున్నాడు అనుకోవాలి..  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: