పురుష లోకానికి కృతజ్ఞతలు అంటున్న జేజమ్మ..!!

Divya
జేజమ్మ అనగానే మనకు ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం అరుంధతి గుర్తుకొస్తుంది. ఈ సినిమాలో అనుష్క శెట్టి ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే..ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ కర్ణాటక ముద్దుగుమ్మ. ఇకపోతే ఇటీవల కొత్త సినిమాల విషయంలో అభిమానులకు కోపాన్ని తెప్పిస్తోంది. అంటే గత ఐదు సంవత్సరాల నుండి ఆమె నుండి వచ్చిన భాగమతి , నిశ్శబ్దం వంటి సినిమాలు మినహాయిస్తే ఏ సినిమాలు కూడా ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకపోవడం గమనార్హం.
ఇకపోతే ఈ రెండు సినిమాలు కూడా యావరేజ్ టాక్ ను సంపాదించుకున్నా.. కమర్షియల్గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. యావరేజ్ సినిమాలు కూడా కమర్షియల్ హిట్ ను కొట్టాయి అంటే అనుష్క క్రేజ్ ఏ రేంజిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇటీవల ఈమె ఉమెన్స్ డే సందర్భంగా అందరి హీరోయిన్స్ తో పాటు అనుష్క కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించడం జరిగింది.. ఇక మహిళా దినోత్సవం సందర్భంగా మగ వారందరికీ కూడా కృతజ్ఞతలు అని తెలియజేసింది.. ఈ సమయంలో ఆడవారి అన్ని పనుల్లో కూడా భాగస్వామ్యం అవుతున్న అందుకుగాను అనుష్క పురుష లోకానికి కృతజ్ఞతలు చెప్పిందనే వార్త వినిపిస్తోంది.

అంతేకాదు తన పోస్ట్ ద్వారా ప్రతి ఒక్క మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.. వృత్తిపరంగా ప్రతి ఒక్కరు కూడా ఒక అద్భుతమైన మహిళ గా పేరును దక్కించుకోవాలి.. శారీరక , మానసిక రుగ్మతలను  బయటకు నెట్టివేసి బయట ప్రపంచంలో దూసుకుపోవడానికి మీరు పరుగులు తీయండి.. మీ జీవితాన్ని మీరు గౌరవించుకుంటూ ఎదగాలి.. మీ భర్త, సోదరుడు, తండ్రి ఇలా ఎవరైనా సరే మీ జీవితంలో బలంగా ఉంటే వారికి ఖచ్చితంగా మీరు థాంక్స్ చెప్పాల్సిందే అంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం అనుష్క చేసిన పోస్ట్ కాస్త బాగా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: