రాధే శ్యామ్ సినిమా రిస్క్ అంటున్న ప్రభాస్ .. కారణం..?

Divya
బాహుబలి, సాహో వంటి సినిమాల తరువాత ప్రభాస్ విడుదల చేయబోతున్న చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమా పూర్తిగా ఒక లవ్ స్టోరీ కథాంశంతో తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కనీసం ఒక్క ఫైట్ సీన్ కూడా జోడించలేదు. ఖచ్చితంగా కొన్ని కామెడీ సీన్స్ అయితే ఉంటాయని యూనిట్ సభ్యులు ఇదివరకే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక ముఖ్యంగా కేవలం ప్రేమ కోసమే యుద్ధం జరుగుతోందని చిత్ర బృందం తెలిపారు. ప్రభాస్ వంటి స్టార్ హీరో ఇలాంటి కమర్షియల్ లవ్ స్టోరీ సినిమాలు చేయడం అంటే అది ఖచ్చితంగా ఒక సాహసమే అని చెప్పవచ్చు..

 సినిమా వర్కవుట్  అయ్యిందంటే పర్వాలేదు కానీ కాస్త అటూ ఇటూ అయ్యింది అంటే చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో రాధే శ్యామ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడడం జరిగింది. రాధే శ్యామ్ సినిమాతో ఒక పెద్ద రిస్క్ చేస్తున్నాను అని తెలిపాడు. తెలుగు సినిమాలలో డార్లింగ్, వర్షం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాలతో హిట్ కొట్టగలిగాను కానీ హిందీలో కూడా అలాంటి సినిమాల్లో నటించాలనుకున్నాడు. అందుచేతనే ఈ ప్రయోగం చేశానని తెలిపాడు ప్రభాస్..
ఇది తన కెరీర్ లో చాలా పెద్ద రిస్క్ అని తెలుసు అయినా కూడా వదిలిపెట్టను అని ప్రభాస్ తెలిపాడు. ఇక రాధే శ్యామ్ చిత్రం ఒక మంచి లవ్ స్టోరీ ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది అని నమ్ముతున్నామని తెలిపారు ప్రభాస్. క్లైమాక్స్లో వచ్చే 13 నిమిషాలు షిప్ ఎపిసోడ్ ప్రతి ఒక్కరికీ చాలా గుర్తు ఉంటుందని తెలిపాడు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నది.. ఈ సినిమాని డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా సెట్టు కోసం కొన్ని వందలకు పైగా సెట్స్ వేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: