కళ్యాణ్ దేవ్ కి వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్..!!

Purushottham Vinay
మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు.. యావత్ భారతీయ సినిమా పరిశ్రమలో కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు అనేది ఉంది.కేవలం నటుడిగానే కాదు.. ఆయన సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా కూడా ఎంతో మందికి అండగా నిలిచారు. తన పేరును మంచి కార్యక్రమాలకు వాడుకుంటే చిరంజీవి ఎల్లప్పుడూ సపోర్ట్ గా నిలుస్తారు. ఇక కొందరు నటీనటుల ఇంకా అలాగే హీరోలు చిరంజీవి పేరును సినిమాల్లోనూ వాడుకుంటుంటారు. చిరుపై అభిమానంతో వారు అలా చేస్తారు. అందుకు కూడా మెగాస్టార్ ఎవర్నీ ఏమీ అనరు. కానీ తనను మాత్రం మోసం చేయాలని చూస్తే మాత్రం ఆయన విడిచిపెట్టరు. ఇక తన చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ విషయంలో కూడా ఆయన ఇలాగే చేశారట.ఇక మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, కుమార్తె శ్రీజ భర్త మెగా ఫ్యామిలీకి అల్లుడు అయ్యాక..టాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ ఏది కూడా పెద్ద హిట్ కాలేదు. అయితే మెగా ఫ్యామిలీకి అల్లుడు కనుక ఆయన మెగాస్టార్ చిరంజీవి పేరును సినిమాల్లో వాడుకోవచ్చు.



అంత వరకు బాగానే వుంది కానీ ఆ ఫ్యామిలీని కల్యాణ్ దేవ్ మోసం చేసే ప్రయత్నం చేశాడట. మెగాస్టార్ చెప్పకున్నా కాని ఆయన చెప్పినట్లు ఒక డైరెక్టర్‌ను కల్యాణ్‌దేవ్ ఇంటికి పిలిచారట. తనతో సినిమా చేయాలని ఆయనని అడిగారట.దీంతో ఈ విషయం మెగాస్టార్ కి తెలిసి ఆయన కల్యాణ్ దేవ్‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. ఇకపై అలాంటి పనులు చేయవద్దని అల్లుడికి గట్టిగా చెప్పారట. సినిమాల్లో తన పేరును వాడుకోవడం బాగానే ఉంటుంది కానీ తన పేరును అడ్డం పెట్టుకుని ఒకరిని ఏదైనా పనిచేయమని చెప్పి బలవంతం చేయొద్దని చిరంజీవి కల్యాణ్‌కు గట్టిగానే క్లాస్ పీకారట. దీంతో ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న కల్యాణ్ దేవ్ అందుకే భార్య శ్రీజతో కూడా సరిగ్గా ఉండడం లేదట. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల నుంచి వీరి విడాకుల విషయం తెరమీదకు వస్తోంది. అయితే ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే కాని వీటిలో నిజం ఎంత ఉంది ? అనేది ఇంకా తెలియాల్సిన విషయం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: