మన సినిమాలే దిక్కు.. తప్పడం లేదు..!
రాజ్‌కుమార్ రావుకి బాలీవుడ్‌లో న్యూ జనరేషన్ యాక్టర్‌గా సూపర్ క్రేజ్ ఉంది. ఎలాంటి క్యారెక్టర్ అయినా సొంత మార్క్ చూపించే రాజ్ కుమార్ ఇప్పుడు తెలుగు 'హిట్' రీమేక్‌కి సైన్ చేశాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్‌సేన్ హీరోగా వచ్చిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ని రీమేక్ చేస్తున్నాడు. భూషణ్ కుమార్‌తో కలిసి దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ రీమేక్‌ని ఒరిజినల్ మూవీ డైరెక్టర్ శైలేష్ తెరకెక్కిస్తున్నాడు.
హృతిక్ రోషన్‌కి సెపరేట్ ఇమేజ్ ఉంది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ లుక్స్‌తో స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ చేస్తాడనే పేరుంది. అయితే మాస్ ఆడియన్స్‌కి దగ్గరయ్యేందుకు తమిళ మాస్ హిట్ 'విక్రమ్ వేద'ని రీమేక్ చేస్తున్నాడు. తమిళ సినిమాని డైరెక్ట్ చేసిన పుష్కర్-గాయత్రి దర్శక ద్వయమే ఈ హిందీ 'విక్రమ్ వేద'ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విక్రమ్‌గా నటిస్తోంటే, హృతిక్ 'వేద' పాత్ర పోషిస్తున్నాడు.
అక్షయ్ కుమార్‌కి మొదట్లో యాక్షన్ స్టార్ ఇమేజ్ ఉంది. అయితే ఈ మధ్య అక్షయ్ కొంచెం ట్రాక్ మార్చి కామెడీ, మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నా, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మాత్రం దూరంగానే ఉంది. దీంతో మాసీ కామెడీ ఎంటర్‌టైనర్ కోసం సౌత్‌కి వచ్చాడు. కోలీవుడ్ నుంచి 'జిగర్తాండ' సినిమాని తీసుకెళ్లాడు. ఫర్హాద్ సమ్‌జీ దర్శకత్వంలో 'బచ్చన్ పాండే'గా రీమేక్ చేశాడు అక్షయ్.