రవితేజ వరుస సినిమాల వెనుక ఉన్న సీక్రెట్ ఇదేనా..?

Divya
 హీరో రవితేజ ఉన్నట్టుండి గత సంవత్సరం నుండి ఎక్కువ సినిమాలు చేస్తూ ఉన్నారు.. ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా రవితేజ గురించి హాట్ టాపిక్ గా మారిపోయింది.. వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తున్నాడు. ఇప్పటివరకు రవితేజ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.. ఇక ఇటీవలే ఖిలాడి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అది ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో తన తదుపరి చిత్రం పై ఫోకస్ పెట్టాడు రవితేజ.

ప్రస్తుతం తన సినిమాలన్నీ ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పైనే ఫోకస్ చేయడం జరుగుతోంది. డైరెక్టర్ త్రినాధ రావు తో కలిసి ధమాకా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్..T.G. విశ్వ ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక గత సంవత్సరం అక్టోబర్ లో ఈ సినిమాని ప్రారంభించారు. ఇందులో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్నది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా చేస్తున్నది చిత్రబృందం. ఇదివరకు కూడా ఈ చిత్రానికి సంబంధించి ఒక షెడ్యూల్ పూర్తి చేయగా, ఇప్పుడు తాజాగా ఒక హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి ఒక షెడ్యూల్ ప్రారంభించింది. ఇక ఇందుకుగాను ఫైట్ మాస్టర్ రామ్-లక్ష్మణ్ తో ఈ ఫైట్ ను చిత్రీకరించారు.
అయితే తాజాగా ఈ చిత్రం షూటింగ్ కోసం ఒక ప్రత్యేకమైన సెట్ ని ఏర్పాటు చేయగా అందులో రవితేజ తో పాటు మలయాళ నటుడు జయరామ్ పాల్గొన్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూలు పూర్తయిందని చిత్ర మేకర్స్ ఒక ఫోటో ని షేర్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది అంటూ హింట్ ఇచ్చారు. అయితే రవితేజ ఇంత ఫాస్ట్ గా సినిమాలని పూర్తి చేయడానికి కారణమేమిటంటే.. తనకి ఏ* అయిపోతుందో అన్న భయం, మరొకటి తనకు స్టార్ ఇమేజ్ ఉన్నప్పుడే కాస్త వెనక్కి తీసుకోవాలని చేస్తున్నాడా అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: