భీమ్లానాయక్ మూవీపై మంచు మనోజ్ కామెంట్స్.. వైరల్..

Satvika
ఇప్పుడు ఎక్కడ చూసిన ఒకటే మాట వినిపిస్తోంది. అదే పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలో నటించిన భీమ్లానాయక్. ఈ సినిమా శుక్రవారం విడుదల అయ్యింది. ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన పోస్టర్లు సాంగ్స్, అన్నీ కూడా భారీ అంచనాలను సినిమా పై తీసుకొచ్చాయి. సాగర్ చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. మాటల మాంత్రికుడు త్రివికమ్ శ్రీనివాస్ మాటలను అందించారు.ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.

మలయాళంలో భారీ హిట్ ను అందుకున్న  అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగులో కూడా భారీ టాక్ ను విడుదలకు ముందే అందుకుంది. అదే ఊపులొ సినిమా కూడా భారీ హిట్ ను అందుకుంటుందని అందరు అభిప్రాయ పడ్డారు. కానీ ఏపి సర్కార్ చివరి నిమిషంలో భారీ షాక్ ను ఇచ్చింది. ఈ సినిమా విడుదల అనేది రసాభాసగా మారింది. కొన్ని చోట్ల థియెటర్స్ మూసివెయగా, కొన్ని ఎరియాల్లొ మాత్రం సినిమా థియేటర్ దగ్గర గంధర గోళం ఏర్పడింది.

ఏది ఏమైనా మొత్తానికి మంచి టాక్ ను అందుకుంది. సినిమాను చూసిన సినీ ప్రముఖులు కొందరు సినిమా పై ప్రసంసలు కురిపిస్తున్నారు.. తాజాగా సినిమా పై మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా ద్వారా అభినందించారు. ఇది ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లొ చక్కర్లు కోడుతుంది..ఇది సినిమాకు ప్లస్ అవుతుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాపై మంచు మనోజ్ కామెంట్ చేస్తూ పోస్ట్ చేశారు.సినిమాని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పవన్ కళ్యాణ్, రానా కలిసి ఉన్న పోస్టర్ ని షేర్ చేస్తూ.. 'ఒకే ఫ్రేమ్ లో నాకిష్టమైన ఇద్దరు వ్యక్తులు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా అని పోస్ట్ లో పేర్కొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: