వలిమై హాల్ వద్ద బాంబు దాడి..

frame వలిమై హాల్ వద్ద బాంబు దాడి..

Purushottham Vinay
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన వలిమై సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ రోజు ఫిబ్రవరి 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది.ఇక అజిత్ కుమార్ సినిమా కోసం ఈ ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. ఎట్టకేలకు సినిమా విడుదల అవ్వడంతో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. వలిమై సినిమా థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ సంబరాల్లో ఆపశ్రుతి చోటు చేసుకుంది. తమిళనాడులో మామూలుగానే అజిత్ సినిమా అంటే ఫ్యాన్స్ లో ఎక్కడలేని ఉత్సహం వస్తుంది. అదే విధంగా కోయంబత్తూరులోని గంగ వల్లి మల్టీప్లెక్స్‌లో అజిత్ వలిమై సినిమా విడుదల అయ్యింది.అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అభిమానులు సంబరాల్లో మునిగిపోయిన సమయంలో ముగ్గురు దుండగులు థియేటర్‌లో పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. బైక్ వచ్చి సదరు దుండగులు వారిపై బాంబులతో దాడి చేశారు.



ఈ దాడిలో ముగ్గురు అభిమానులకు చాలా తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ దుండగులను పట్టుకోవడానికి అజిత్ అభిమానులు ప్రయత్నించారు. కానీ ఆ దుండగులు అక్కడ నుంచి తప్పించుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని విచారణను ప్రారంభించారు. దాడికి పాల్పడ్డ దుండగులు ఎవరనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు అక్కడి పోలీసులు.ఇక ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తుండగా.. అలాగే టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్ పాత్రలో నటించాడు.సినిమా విడుదలకు ముందు పోస్టర్స్, వీడియోస్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి.



ఈ సినిమా కోసం కోలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు.. తెలుగుతోపాటు..ఇతర భాషల్లోని అజిత్ కుమార్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ సినిమాలో బైక్ రేసింగ్ సీన్స్ అనేవి మెస్మరైజ్ చేస్తున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. జీ స్టూడియోతో కలిసి బే వ్యూ ప్రాజెక్ట్ బ్యానర్‌పై బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: