టాలీవుడ్ లో ఉన్న అప్కమింగ్ యంగ్ హీరోల్లో సంతోషం శోభన్ ఒకరు. సుమంత్ నటించిన గోల్కొండ హై స్కూల్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆకట్టుకున్న సంతోష్.. ఆ తర్వాత 'తాను నేను"' సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. ఇక ఆ సినిమా తర్వాత 'పేపర్ బాయ్' అనే సినిమాతో తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పేపర్ బాయ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం లో భాగంగా తాను ఎంచుకునే కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు సంతోష్ శోభన్..
ఈ క్రమంలోనే ఇటీవల ఈ హీరో నటించిన 'ఎక్ మినీ కథ', 'మంచి రోజులు వచ్చాయి' సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ అందుకున్నాయి. ఇక అదే ఫామ్లో వెబ్ సిరీస్ లో కూడా నటించి ఆకట్టుకున్నాడు₹ తెలుగు ఓటీటీ ఆహా నిర్మించిన 'బేకర్ అండ్ బ్యూటీ' అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ రంగంలో అడుగుపెట్టే సక్సెస్ అయ్యాడు సంతోష్. సినిమా ఫలితం తో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ప్రస్తుతం రెండు, మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి మెర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇటీవలే నితిన్ తో మాస్ట్రో సినిమా తెరకెక్కించిన మేర్లపాక గాంధీ ఇప్పుడు సంతోష్ శోభన్ తో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ చాలా సైలెంట్ గా సాగుతోంది. సినిమాకు ఎలాంటి పబ్లిసిటీ లేకుండా సింపుల్గా షూటింగ్ ముగించే ప్రయత్నాలు చేస్తున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి ప్రాంతంలో ముగించుకొని హైదరాబాద్ కి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇక సంతోష్ శోభన్ నటించిన ఎక్ మినీ కథ సినిమాకీ మేర్లపాక గాంధీ కథను అందించాడు. అయితే ఇప్పుడు అదే హీరో తో దర్శకుడిగా సినిమా చేస్తున్నాడు. పైగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో సంతోష్ ఇలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి...!!