నందమూరి కల్యాణ్ రామ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో 'పటాస్ 2' ఉంటుందని తాజాగా దర్శకు కన్ఫామ్ చేయడం జరిగింది.ఈయన రచయిలుగా సక్సెస్ అయిన వారిలో దాదాపు అందరూ స్టార్ డైరెక్టర్స్‌గానూ మారుతున్నారు. ఇక ఇప్పటికే ఇలా రచయితలుగా సక్సెస్ అయిన త్రివిక్రమ్, కొరటాల శివ, సుకుమార్ లాంటి వారు దర్శకులుగా మారి స్టార్ హోదాను అందుకున్నారు. కాగా ఈ క్రమంలోనే రచయితగా పలు సూపర్ హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి కూడా 'పటాస్' సినిమాతో దర్శకుడై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కించిన మొదటి సినిమానే మంచి కమర్షియల్ సక్సెస్ కావడంతో వరుసగా స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశాలు
అందుకుంటున్నారు.ఇక దీని తర్వాత అనిల్ రావిపూడి సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్ట్రర్స్ తీసి స్టార్ డైరెక్టర్‌గా మారాడు.ఇక రాజమౌళి, కొరటాల శివ తర్వాత తెలుగులో హీరోలకు వరుస హిట్స్ ఇస్తున్న దర్శకుడు ఈయనే. కాగా ప్రస్తుతం ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్‌లతో ఎఫ్ 3 రూపొందిస్తున్నారు.ఇక దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా మే 27వ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇప్పటికే అధికారికంగానూ విడుదల తేదీని ప్రకటించారు.ఇక అనిల్ రావిపూడికి దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చిన నందమూరి కల్యాణ్ రామ్ తో మళ్ళీ సినిమా చేయలేదు.ఇటీవల సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది.కాగా దీనిపై తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ
ఇచ్చారు. అదేంటి అంటే మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు రాలేదని..అసలు గ్యాప్ వచ్చే ఛాన్సే లేదని క్లారిటీ ఇచ్చారు.అయితే 'పటాస్' తర్వాత కూడా ఇద్దరం కలిసి సినిమా చేయాలనుకున్నాము. అయితే ఓ కథ చెప్పాను..బావుందన్నారు గానీ, ఎందుకో ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు. ఇక , మా ఇద్దరి కాంబోలో తప్పకుండా 'పటాస్ 2' ఉంటుంది..అని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.అయితే అనిల్ రావిపూడి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఎఫ్ 3 సినిమా పూర్తైన తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించనున్నారు.కాగా ఇప్పటికే అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నానని బాలయ్య వెల్లడించిన సంగతి తెల్సిందే.