హ్యాపీ బర్త్ డే : కళాతపస్వీ.. నీకు లేరయ్యా సాటి !
బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ ఫిల్మ్స్‌దే రాజ్యం అని ట్రేడ్ సర్కిల్స్‌లో ఒక అభిప్రాయం ఉంది. అయితే ఆర్ట్స్‌ని సినిమా స్క్రీన్‌కి అనుకూలంగా మార్చితే, కమర్షియల్ ఫిల్మ్స్ కంటే భారీ వసూళ్లు సాధించొచ్చని ప్రూవ్ చేసిన దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్లలో ముందుండే దర్శకుడు కె.విశ్వనాథ్.
కె.విశ్వనాథ్ ఆడియో గ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత స్క్రీన్ ప్లై రైటర్‌గా మారారు. అక్కడి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్‌గా టర్న్ అయి 'ఆత్మగౌరవం' సినిమాతో డైరెక్టర్ అయ్యారు. నంది అవార్డ్స్‌లో ఈ సినిమా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా బ్రాంజ్ గెలుచుకుంది. ఆ తర్వాత 'చెల్లెలి కాపురం, కాలం మారింది, శారద, ఓ సీత కథ, జీవన జ్యోతి' సినిమాలోనూ డైరెక్టర్‌గా నంది అవార్డులు అందుకున్నారు కె.విశ్వనాథ్.
ప్రతీ దర్శకుడి జర్నీలో బోల్డన్ని బ్లాక్‌బస్టర్స్ ఉంటాయి. కానీ మైలురాళ్లుగా నిలిచిపోయే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇండియన్ కల్చర్‌ని ప్రమోట్ చేస్తూ విశ్వనాథ్ తీసిన సినిమాలన్నీ మైల్‌స్టోన్స్ అనే చెప్పొచ్చు. అలా జాతీయస్థాయిలోనూ ప్రశంసలు అందుకుంది శంకరాభరణం.
వెండితెర యజ్ఞం చేసినట్టు, భారతీయ శాస్త్రీయ కళలని సినిమాలుగా మలిచిన కళాతపస్వి 'శుభప్రదం' తర్వాత డైరెక్షన్‌కి బ్రేక్ ఇచ్చారు. అలాగే వయసు పైబడ్డాక యాక్టింగ్‌కి కూడా విరామం ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే కె.విశ్వనాథ్ మళ్లీ మెగాఫోన్ పడితే చూడాలని, వెండితెరపైకి వస్తే థియేటర్‌కి వెళ్లాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. కళాతపస్వి త్వరలోనే అభిమానుల కోరికని నెరవేరుస్తాడని ఇండియా హెరాల్డ్ ఆశిస్తోంది.