టాలీవుడ్ కుర్ర హీరోలలో ఒకరైన నిఖిల్ హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా స్టడీగా సినిమాలు చేసుకుంటూ దూసుకు పోతున్నాడు. హీరో నిఖిల్ సినిమా థియేటర్లోకి వచ్చి చాలా కాలమే అయింది.
నిఖిల్ వి దాదాపు మూడు సినిమాలు పూర్తయి వున్నాయి. కానీ ఎప్పుడు థియేటర్లలోకి వస్తాయో మాత్రం తెలియదు. గీతా 2 సంస్థలో 18 పేజెస్ రెడీ అయి వుందట. పెద్దగా ఖర్చు పెట్టిన సినిమా కాదట. భోగవిల్లిబాపినీడు లండన్ బ్యాక్ డ్రాప్ లో నిర్మించిన సినిమా కూడా పూర్తయి వుంది. బడ్జెట్ పరంగా అదీ అస్సలు సమస్య కాదు.
పీపుల్స్ మీడియా నిర్మించిన కార్తికేయ 2 మాత్రం కాస్త ఓవర్ బడ్జెట్ అయిందని తెలుస్తోంది. ఈ సినిమా విడుదల ఎప్పుడో తెలియదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై హీరో నిఖిల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.ఈ మహమ్మారి కెరీర్‌ను ఈ స్థాయిలో ప్రభావితం చేయడం చాలా బాధాకరం అని ఇటీవల స్పందించాడు.
లాక్ డౌన్ వేళ యంగ్ హీరో నిఖిల్ పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. 2020 డిసెంబర్ నెలలో కేవలం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య తన ఇష్ట సఖి డాక్టర్ పల్లవిని పెళ్లాడారట నిఖిల్. వీరి పెళ్లి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలోమాత్రం తెగ వైరల్ అయ్యాయి. నిఖిల్- పల్లవి లవ్ స్టోరీ గురించి చాలామంది ప్రేక్షకులు కూడా ఆరాదీశారు. ఈ నేపథ్యంలో తాజాగా తమ పెళ్లికి ముందు జరిగిన పరిణామాలు, లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ ఓపెన్ అయిందట నిఖిల్ సతీమణి పల్లవి.
మొదటగా నిఖిల్ తన లవ్ ప్రపోజ్ చేశారని అయితే నిఖిల్ ఐ లవ్ యూ అని చెప్పగానే జోక్ చేస్తున్నాడేమో అనుకుందట పల్లవి. అంతలోనే నిఖిల్ ఆ మాట చెప్తాడని ఊహించలేదని ఆమె చెప్పుకొచ్చిందట . అయితే నిఖిల్‌కి వెంటనే ఓకే చెప్పకుండా ఇంట్లో వారితో మాట్లాడి వారి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే నిఖిల్ ప్రేమకు అంగీకరించాను అన్నట్లుగా పల్లవి చెప్పుకొచ్చిందట. ఇంట్లో వాళ్ళతో యాక్టర్ అని చెప్పలేదని అలాగే బిజినెస్మెన్ అని చెప్పానని తెలిపింది.
నిఖిల్ నటించిన హ్యాపీడేస్ మరియు కార్తికేయ సినిమాలను మాత్రమే పెళ్లికి ముందు చూశానని.. కానీ పెళ్లి తర్వాత కూర్చోబెట్టి తను నటించిన అన్ని సినిమాలను కూడా బలవంతంగా నిఖిల్ చూపించాడంటూ పల్లవి చెప్పుకొచ్చిందట. పెళ్లి తర్వాత గోవాలో ఓ 20 రోజుల పాటు సరదాగా ఎంజాయ్ చేశామని ప్రస్తుతం తన వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉందని పల్లవి తెలిపిందట . నిఖిల్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ అందరితో కలిసిపోవడం అని ఆమె చెప్పుకొచ్చింది...